Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మాన్నిమిలమిల మెరిపించే ఆరెంజ్

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (12:04 IST)
చలికాలంలో కొందరికి చర్మం తెల్ల తెల్లగా పొడిబారినట్లు ఉంటుంది. కొందరు సహజంగానే పొడిబారిన చర్మం కలిగివుంటారు. ముఖంపైన చలి ఎక్కువ ప్రభావం చూపుట వలన వారు ఒక రకమైన ఇబ్బందికి గురువుతారు. అలాంటి వారికి కొన్ని చిట్కాలు...
 
సహజంగా చలి వల్ల కలిగే ఈ రకమైన సమస్యను తగ్గించేందుకు ఎక్కువశాతం నీరు తాగుతారు. ఇదీ ఒక రకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆరంజ్, తేనె వాడినట్లైతే ఈ సమస్యపైన ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
ఆరంజ్ పండ్లను తినేసి తొక్కలను బయట విసిరివేయకుండా, వాటిని ఎండలో ఎండబెట్టి పౌడర్‌గా చేసుకోవాలి. ఆ పౌడర్‌ని నీటిలో కలిపి ముఖానికి మరియు చేతులకు రాసుకొని కొద్దిసేపు తర్వాత శుభ్రం చేసుకుంటే పొడిబారిన చర్మం ఇట్టే మాయమైపోతుంది.
 
అదేవిధంగా అర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక గ్లాసు వేడి నీటిని, ఒకటి టీ స్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపుతో తాగినట్లైతే చర్మం నిగనిగలాడుతుంది. అంతేకాక శరీరంలో వున్న క్రొవ్వు పదార్థాలు తగ్గి నాజూకుగా తయారవుతారు. 
 
జిడ్డు చర్మం వున్నవారు రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి రాసినట్లైతే చర్మం మెరిసిపోతుంది. ఎ మరియు సి విటమిన్లు ఎక్కువగా కలిగివున్న పండ్లను ప్రతిరోజు తీసుకుంటే చర్మం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మారుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.  
 
నల్లమచ్చలతో బాధపడేవారు టమోటో గుజ్జుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్నిముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకుంటే మచ్చలు తొలగిపోతుంది. మొక్కజొన్న పిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు శరీరానికి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే శరీరం మిలమిలలాడుతుంది.
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments