Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో కొబ్బరి బొండాం.. మజ్జిగ తాగితే జలుబు చేస్తుందా?

వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి తాపాన్ని దాహాన్ని తీర్చడం కోసం నీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు పుచ్చకాయ, కర్బూజ వంటి నీటి శాతం ఎక్కువ గల పండ్లను తీసుకోవాలి. వేసవిలో కొబ్బరిబొండాం, మజ్జిగ, నిమ్మరస

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:53 IST)
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ  వేడి తాపాన్ని దాహాన్ని తీర్చడం కోసం నీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు పుచ్చకాయ, కర్బూజ వంటి నీటి శాతం ఎక్కువ గల పండ్లను తీసుకోవాలి. వేసవిలో కొబ్బరిబొండాం, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేస్తాయి.

పండ్ల రసాల ద్వారా తీసుకోకుండా.. పండ్లను అలాగే తినడం మంచిది. తద్వారా పండ్ల మేలు రెట్టింపు అవుతుంది. వేసవిలో నీటితో పాటు నిమ్మరసంలో తేనె, పంచదార, చిటికెడు ఉప్పు కలిపి సేవిస్తే దాహం తీరుతుంది.
 
వేసవిలో చర్మ సంరక్షణకు గంధం, శెనగపిండి, పెసర పిండిని సమపాళ్లలో తీసుకుని పేస్టులా ఒళ్లంతా రాసుకుని 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. తద్వారా చర్మ రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవిలో తడి బట్టలను ధరించకూడదు. కాటన్ దుస్తుల్నే ధరించాలి.

ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేయాలి. వారంలో రెండు రోజులు తలంటు స్నానం చేయాలి. రోజు మార్చి రోజు రాత్రిపూట మెంతుల్ని నానబెట్టి.. ఉదయం పూట పేస్టులా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
 
వేసవిలో కొందరికి కొబ్బరి బొండాం, మజ్జిగ తాగితే జలుబు చేస్తుంది. అలాంటి వారు చిటికెడు మిరియాల పొడిని చేర్చి తీసుకుంటే.. జలుబు ఉండదు. ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, అరటికాడ, గుమ్మడి, పొట్లకాయ వంటి కూరగాయలను సలాడ్ల రూపంలో తీసుకోవాలి.

సలాడ్లలో ఉప్పు, మిరియాల పొడి చిటికెడు చేర్చుకోవచ్చు. వేసవిలో వేడి ఎక్కువైతే.. జీలకర్ర, మెంతుల పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట రాగి, సజ్జలు, మొక్కజొన్న, గోధుమ, బార్లీ పిండితో తయారైన జావను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments