Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయే నూనెలతో ఎలాంటి ప్రయోజనం?

1. నువ్వుల నూనె దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట దీంతో చిగుళ్లను వేళ్లతో అద్ది రుద్దాలి. చిగుళ్ల ఆరోగ్యంగా, గట్టిగా ఉంటాయి. ఈ నూనెతో అలర్జీలు వస్తాయన్న భయం కూడా లేదు. దంతాలు తెల్లబడాలనుకునేవారు ఇలా కొబ్బరినూనెతోనూ ప్రయత్నించవచ్చు. 2. తల

Webdunia
మంగళవారం, 23 మే 2017 (21:18 IST)
1. నువ్వుల నూనె దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట దీంతో చిగుళ్లను వేళ్లతో అద్ది రుద్దాలి. చిగుళ్ల ఆరోగ్యంగా, గట్టిగా ఉంటాయి. ఈ నూనెతో అలర్జీలు వస్తాయన్న భయం కూడా లేదు. దంతాలు తెల్లబడాలనుకునేవారు ఇలా కొబ్బరినూనెతోనూ ప్రయత్నించవచ్చు.
 
2. తలకి సంబంధించినంత వరకూ ఆముదం, భృంగరాజ్, ఆలివ్, కొబ్బరి, మందార నూనెలు మేలు చేస్తాయి. ఇవి జట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి. వీటిని విడివిడిగా కానీ, కలిపికానీ వాడుకోవచ్చు. షాంపుతోపాటు ఇలా రెండుమూడు చక్కల నూనె వాడితే తలస్నానానికి కండిషనర్‌తో పనుండదు. 
 
3. ఆముదం కనుబొమల అందానికి ఎంతో ఉపకరిస్తుంది. రెండుమూడు చుక్కల ఆముదాన్ని పట్టించి రాత్రంతా వదిలేయండి. ఇందులోని మాంసకృత్తులు కనుబొమలు ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తాయి. పాత మస్కారా బ్రష్‌ని ఆముదంలో ముంచి అద్దితే వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి.
 
4. యాక్నె వంటి సమస్యలుంటే టీట్రీ నూనె చక్కగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు పోవడానికి విటమిన్ 'ఇ' నూనె వాడటం మేలు. చేతివేళ్లు బాగా పొడిబారి తెగినట్లు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు గోళ్ల చుట్టూ ఉన్న చర్మంపైకి లేచి ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు బాదం నూనె రాస్తే అక్కడి చర్మానికి తేమ అంది ఆరోగ్యంగా మారుతుంది. 
 
5. పాదాలు పొడిబారితే... ముందుగా గోరువెచ్చని నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రెండు చుక్కలు పెప్పర్‌మింట్ నూనె కలిపిన ఆలివ్ నూనె అరి పాదాలకు రాస్తే సమస్య తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments