Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెర్బల్ టీల హెల్త్ బెనిఫిట్స్, ఇవి తాగితే ఏమేమి ప్రయోజనాలు?

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (19:26 IST)
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
 
పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, మంటను తగ్గించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది. మోరింగా(మునగ ఆకుల)టీ తాగితే బరువు తగ్గించుకోవచ్చు, రక్తపోటును క్రమబద్ధీకరించి రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది.
 
మల్లెపూల టీ రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. లెమన్‌గ్రాస్ టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతో పాటు త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి. దాల్చిన చెక్క టీ ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది.
 
గ్రీన్ టీ అధిక రక్తపీడనాన్ని మరియు కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

తర్వాతి కథనం
Show comments