Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్ష పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (11:06 IST)
ఈ కాలంలో ద్రాక్ష పండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద్రాక్ష పండ్లంటే నచ్చని వారుండరు. ద్రాక్ష పండ్లలో పలురకాలున్నాయి.. నలుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో లభిస్తాయి. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా వీటిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
1. చాలామంది తరచు నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటివారు.. రాత్రివేళలో కప్పు ద్రాక్ష పండ్లు సేవిస్తే సమస్య తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
2. ద్రాక్ష పండ్లను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే కడుపులోని మంట తగ్గుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాస్ ద్రాక్ష పండ్ల రసాన్ని సేవిస్తే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
3. ద్రాక్ష తొక్కలను బాగా ఎండబెట్టుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచు పాలలో కలిపి తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్తున్నారు వైద్యులు. 
 
4. ద్రాక్ష పండ్ల గుజ్జును వేరుచేసుకోవాలి. అందులో స్పూన్ మోతాదులో కొద్దిగా తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై గల నల్లటి ఛారలు, వలయాలు పోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. 
 
5. ద్రాక్ష పండ్లలోని విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. ద్రాక్ష పండ్లను ప్రతిరోజూ సలాడ్ రూపంలో ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments