Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం పాలు తాగితే అద్భుత ప్రయోజనాలు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (23:07 IST)
అల్లం. ఇది ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. అల్లాన్ని ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఉప‌యోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము.
 
అల్లం పాలుతో జ‌లుబు, ఫ్లూ, అజీర్ణం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
 
అల్లం పాలు తాగితే రోగ నిరోధ‌కశ‌క్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.
 
అల్లంలో ఉండే థ‌ర్మోజెనిక్ గుణాలు చలికాలంలో మ‌న‌ల్ని వెచ్చ‌గా ఉంచుతాయి
 
అల్లం, పాలు రెండింటినీ క‌లిపి తాగ‌డం వ‌ల్ల ల‌భించే పోష‌కాలు ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉంచుతాయి.
 
అల్లం పాలు త‌యారీకి ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి.
 
చిటికెడు న‌ల్ల మిరియాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, తగినంత బెల్లం సిద్ధం చేసుకోవాలి.
 
పాత్ర‌లో పాల‌ను తీసుకుని అందులో తురిమిన అల్లం వేసి 5 నిమిషాల పాటు మ‌రిగించాలి.
 
ఆ తర్వాత న‌ల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేయాలి.
 
పాత్ర‌ను దించి అందులో బెల్లం పొడి వేసి బాగా కలపాలి.
 
అలా త‌యారైన అల్లం పాల‌ను గోరువెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments