Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి జ్వరాన్నయినా చిటికెలో పోగొట్టే చిట్కా... ఏంటో తెలుసా?

జ్వరం. ఏదో ఒక పరిస్థితిలో ప్రతి ఒక్కరు జ్వరం బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేట్. అంటే 98.6 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. జ్వరం వస్తే బాడీ టెంపరేజర్ పెరుగుతుంది. జ్వరం తీవ్రత 107 డిగ్రీల ఫా

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (20:49 IST)
జ్వరం. ఏదో ఒక పరిస్థితిలో ప్రతి ఒక్కరు జ్వరం బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేట్. అంటే 98.6 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. జ్వరం వస్తే బాడీ టెంపరేజర్ పెరుగుతుంది. జ్వరం తీవ్రత 107 డిగ్రీల ఫారన్ హీట్ మించినప్పుడు బ్రెయిన్ డామేజ్ అవుతుంది. జ్వరం వచ్చినప్పుడు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఏమీ తినాలని అనిపించదు. నోరంతా చేదుగా ఉంటుంది. నీరసంగా ఉంటుంది. జ్వరాన్ని తగ్గించాలంటే వేడిని తగ్గించాలని.. బాడీలోని టెంపరేచర్‌ను కంట్రోల్ చేయాలి.
 
అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్‌ను నార్మల్ లెవల్‌కు తీసుకువస్తే జ్వరాన్ని తగ్గించనట్లే. అందుకోసం చిన్న చిట్కాను పాటిస్తే సరిపోతుంది. అదే పెసరపప్పు. ఎంత పెద్ద జ్వరాన్నయినా ఇట్టే తగ్గించే గుణం పెసరపప్పుకు ఉంటుంది. ఒక కప్పు పెసరపప్పును తీసుకుని దానిని బాగా కడిగి ఒక గిన్నెలో నిండా నీళ్ళు పోసి అందులో పెసరపప్పును 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తరువాత పెసరపప్పులోని నీళ్ళను తీసుకుని జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగించాలి. ఈ నీటిని తాగితే 10 నిమిషాల్లో బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. 20 నిమిషాల తరువాత అతను సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి. దీంతోపాటు వైద్యులు ఇచ్చే మందులు కూడా వాడాలి.
 
పెసరపప్పులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి. 20 నిమిషాలు పెసరపప్పు నానబెడితే ఆ గుణాన్ని నీటికి సంక్రమింపజేస్తుంది. పెసరపప్పులో విటమిన్ బి, సి, మాంగనీస్‌తో పాటు ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలోహిత కిరణాలు, పర్యావరణం నుంచి వచ్చే చర్మ సమస్యలను నుంచి కూడా కాపాడేశక్తి పెసలకు ఉంటుంది. పెసలను వారానికి రెండుసార్లయినా ఆహారంలో భాగం చేసుకోవాలి. వేడి ఎక్కువగా ఉండేవాళ్ళకు ఈ పెసరపప్పు ఒక వరం. అందుకే పండుగల వేళ పెసరపప్పు పానకం చేస్తారు. శరీరంలోని వేడిని తగ్గించడమే కాదు... వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోను పెసరపప్పు సమర్థవంతంగా పనిచేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

తర్వాతి కథనం
Show comments