Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగ చిగుళ్లు, మునగ చెట్టు వేరు, మునగ జిగురు తీసుకుంటే...

మనం ప్రతి రోజు రకరకాల ఆహార పదార్థాలను, కాయగూరలను, ఆకుకూరలను తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యమైనది మునగాకు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తర

Webdunia
సోమవారం, 30 జులై 2018 (21:58 IST)
మనం ప్రతి రోజు రకరకాల ఆహార పదార్థాలను, కాయగూరలను, ఆకుకూరలను తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యమైనది మునగాకు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తరచుగా ఉపయోగించటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. లేత మునగ చిగుళ్లు రోజూ రసం తీసుకొని త్రాగితే ఒళ్లు తగ్గుతుంది.
 
2. మునగచెట్టు వేరును దంచి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. పక్షవాతం ఉన్నా తగ్గుతుంది.
 
3. మునగ జిగురు ఆవు పాలలో మెత్తగా నూరి నుదురు మీద, కణతల మీద పట్టి వేస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. 
 
4. మునగాకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని పప్పులో పెట్టుకొని వారంలో రెండు రోజులు తినటం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. ఇది కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
 
5. మునగాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవటం వలన కళ్లను ఆరోగ్యంగా ఉంచి కంటిచూపును మెరుగుపరుస్తుంది.
 
6. ఒక టేబుల్ స్పూన్ మునగాకు పేస్టులో కొంచెం తేనె, కొంచెం నీటిని కలిపి ప్రతిరోజు కాళీ  కడుపుతో త్రాగటం వలన శరీరంలోని కొవ్వు తగ్గి సన్నగా, నాజూగ్గా తయారవుతారు.
 
7. మునగాకు ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ పేస్టును ముఖానికి తరచూ రాసుకోవటం వలన మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments