Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావు తగ్గే డైట్‌ అయినా... మితంగా తీసుకోవాలి...

లావు కాకుండా ఉండేందుకు చాలామంది డైట్‌ పాటిస్తుంటారు. ఇందుకోసం నిత్యం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొంటుంటారు. కానీ... ఆరోగ్యమైన డైట్‌ అయినా సరే కొన్ని పదార్థాల్లో కాలరీల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని పరిమితికి మించి తింటే లావు తగ్గడం అటుంచితే భార

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2016 (18:21 IST)
లావు కాకుండా ఉండేందుకు చాలామంది డైట్‌ పాటిస్తుంటారు. ఇందుకోసం నిత్యం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొంటుంటారు. కానీ... ఆరోగ్యమైన డైట్‌ అయినా సరే కొన్ని పదార్థాల్లో కాలరీల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని పరిమితికి మించి తింటే లావు తగ్గడం అటుంచితే భారీగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్యమైన డైట్‌ను కూడా మితంగానే తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా...
 
• సలాడ్స్‌..
సలాడ్స్‌ ఆరోగ్యకరమైన ఆహారమే. కానీ వాటిని తయారుచేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చీజ్‌, నట్స్‌, క్రీమ్‌ లాంటివి సలాడ్స్‌లో కలపకూడదు. అలా కాదని ఇవన్నీ వేసిన సలాడ్స్‌ తింటే ఒక పిజ్జా తినడం వల్ల పొందే ఫ్యాట్‌ కన్నా కూడా ఎక్కువ ఫ్యాట్‌ శరీరంలో చేరుతుంది. ఫ్లేవర్‌ కావాలనుకుంటే సలాడ్స్‌లో ఏవైనా గింజలు వేసుకోవచ్చు.
 
• అవకాడొ...
అవకాడొలో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. ఒక్క అవకాడొలో పది గ్రాముల పీచుపదార్థం ఉంటుంది. అంతేకాదు అరటిపండ్లలో ఉన్నంత పొటాషియం అవకాడొలో ఉంటుంది. యాంటాక్సిడెంట్లు కూడా వీటిల్లో బాగా ఉంటాయి. లావు తగ్గాలంటే అవకాడొను పరిమితంగా తినాలి. ఎందుకంటే వీటిల్లో కాలరీలు బాగా ఉంటాయి. కొవ్వు పదార్థం కూడా ఎక్కువే. అందుకే సలాడ్స్‌లో గాని, శాండ్‌విచెస్‌లోగాని అవకాడొను పరిమితంగా వాడాలి. రోజుకు ఒక అవకాడొ మించి తినకూడదు. 
 
• స్మూతీస్‌...
స్మూతీస్‌ ఆరోగ్యానికి మంచివే. అయితే వీటిని పీనట్‌ బటర్‌, చాకొలెట్‌, ఫ్లేవర్డ్‌ సిరప్‌ లేదా క్రీముల్లాంటి వాటితో తీసుకుంటే మంచిది కాదు. తక్కువ కొవ్వు ఉండే పెరుగు, తీయదనం లేని పాలు, తాజా పండ్లతో చేసిన స్మూతీస్‌ తింటే లావు అవ్వరు.
 
• నట్స్‌...
నట్స్‌ ఆరోగ్యానికి మంచివే. వాటిల్లో గుండెకు బలాన్నిచ్చే కొవ్వు పదార్థాలు ఎన్నో ఉన్నాయి. అయితే శరీరం సన్నగా ఉండాలంటే మాత్రం వీటికి దూరంగా ఉండాలి. కొందరు బీర్‌తో పాటు నట్స్‌ తింటుంటారు. అది మంచి అలవాటు కాదు. బీర్‌ తాగేవాళ్లు నట్స్‌కు బదులు గుమ్మడి గింజలు, అవిసెగింజల్లాంటివి తింటే బెటర్‌. చక్కెర లేదా ఉప్పు వేసిన నట్స్‌ ఆరోగ్యానికి హాని చేస్తాయి
 
• ప్రొటీన్‌ బార్‌...
ప్రొటీన్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అలా అని చక్కెర కలిపిన ప్రొటీన్‌ బార్లు తింటే మంచిది కాదు. శరీర బరువు తగ్గాలనుకుంటే ప్రొటీన్‌ బార్లకు దూరంగా ఉండాలి. వీటికి బదులు గుడ్డులోని తెల్లసొన, కాయధాన్యాలు తింటే మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Show comments