డైటింగ్ చేస్తున్నారా..? ఫాస్ట్‌ఫుడ్‌‌కు దూరంగా ఉండండి!

Webdunia
శనివారం, 9 ఆగస్టు 2014 (17:06 IST)
ఆధునిక యుగంలో మహిళలు సైతం పురుషులతో సమానంగా ఉరుకులు పరుగులతో కాలం గడుపుతున్నారు. కార్యాలయాలకు వెళ్లే మహిళలు కడుపునిండితే చాలునని ఏదో ఒకటి త్వరగా అయ్యే వంటకాన్ని చేసుకుంటూ హడావుడిగా వెళ్లిపోతుంటారు. ఇలా ఫాస్ట్ ఫాస్ట్ తయారు చేసే వంటకాలను తినడం ద్వారా ఊబకాయంతో బాధపడుతుంటారు. మళ్లీ డైటింగ్ అనే పేరుతో ఏవో కొన్ని పాటిస్తుంటారు. అలా మీరు కూడా ఊబకాయానికి చెక్ పెట్టాలనుకుంటే ఫాస్ట్ ఫుడ్‌ను మానేస్తే సరిపోతుందని న్యూట్రిషన్లు చెబుతున్నారు. 
 
డైటింగ్ చేయాలనుకునే మహిళలు ఎక్కువ సార్లు మోతాదులో తినడం మంచిది. రెండు మూడు గంటలకు ఓసారి ఏదో ఒకటి తినండి. అదికూడా వేగంగా నోట్లో కుక్కేయకుండా మెల్లగా రుచిని ఆస్వాదిస్తూ తింటే కడుపు నిండుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవద్దు. 
 
ఉదాహరణకి పండ్లరసాల కన్నా పండు తినడం మేలు. రోజుకి నాలుగైదు సార్లు పండ్లు, సలాడ్స్ తీసుకోవడం మంచిది. కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల కన్నా ప్రోటీన్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి.  ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం జోలికి వెళ్లవద్దు. నీళ్లు సరిపడా తాగడం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

బంగ్లాదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం - 6 గంటలకే దుకాణాలు బంద్

టీఆర్ఎస్ అనే పేరు పబ్లిక్ డొమైన్‌లో వుంది.. కవిత పార్టీ పేరు అదేనా?

అమరావతిలో 9 నగరాలు ప్లాన్ చేశాం.. ఏపీ సీఎం చంద్రబాబు

సమస్యలపై మాట్లాడమంటే సమోసా ధరలు తగ్గించాలంటున్నారు : రాఘవ్‌పై ఆప్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

Show comments