Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతాఫలం తింటే జుట్టు నల్లగా మెరిసిపోతుంది...!!

సీతాఫలం దాదాపు అన్ని దేశాల్లో విరివిగా దొరికే పండు. ఈ పండును సీజన్‌ ఉన్నంత వరకు తప్పకుండా తింటుంటే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి, చలికాలంలో ఎక్కువగా దొరి

Webdunia
సోమవారం, 11 జులై 2016 (21:08 IST)
సీతాఫలం దాదాపు అన్ని దేశాల్లో విరివిగా దొరికే పండు. ఈ పండును సీజన్‌ ఉన్నంత వరకు తప్పకుండా తింటుంటే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి, చలికాలంలో ఎక్కువగా దొరికుతుంది.ఈ పండును సీజన్ ముగిసేంత దాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమే కాకుండా ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది. సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. 
 
వాంతులు, తలనొప్పి విరుగుడుగా, చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇది పిల్లల ఎదుగుదల, ఎముకల పుష్టిని కలిగిస్తుంది. ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది. కుదుళ్లకు దృఢత్వానిస్తుంది. పేగుల్లో ఉండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్ని ఇస్తుంది. త్రిదోష నివారిణిగా శరీరంలో ఉండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.
 
ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల వరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాములు, విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ నాలుగు శాతం, సోడియం పది మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను  తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది. ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతం అవుతాయి. బలహీనత, సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments