Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతిలో వేయించిన జీలకర్ర చూర్ణంలో అది కలిపి ఆడవాళ్లు తీసుకుంటే...

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (20:01 IST)
సాధారణంగా మనం జీలకర్రను తాలింపు దినుసులలో ఎక్కువగా వాడుతుంటాము. దీనిలో అనేక రకములైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. జీలకర్ర అనేక రకములైన వ్యాదులను రాకుండా నిరోదించడంతో పాటు వచ్చిన వ్యాదులను తగ్గించడానికి తోడ్పడుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు కొద్దిగా జీలకర్రను నీటిలో వేసి మరిగించి గోరువెచ్చనివి తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. జీలకర్రలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. జీలకర్ర శరీరానికి అవసరమయ్యే  మాంసకృత్తులు, పిండి, కొవ్వుపదార్థాలు, ఐరన్, కాల్షియం, ఇతర విటమిన్లు, సువాసన కల్గించే తైలాలు ఉన్నాయి.
 
2. జీలకర్ర, ఉప్పు, తేనె, నెయ్యి సమపాళ్లలో కలిపి నూరి తేలు, కందిరీగ, తేనెటీగ లాంటి కీటకాలు కుట్టినప్పుడు ఆయా భాగాలపై పట్టిస్తే మంట, నొప్పి, బాధ, దురద త్వరితంగా తగ్గుతాయి.
 
3. జీలకర్ర పొడి, బెల్లం సమానంగా కలిపి నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసి రోజూ మూడు పూటలూ తీసుకుంటుంటే జ్వరాలు, పైత్యం వల్ల వచ్చే దద్దుర్లు, దురద తగ్గుతాయి. జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. ఈ మాత్రలను పాలతో తీసుకుంటే మగవారిలో వీర్యం వృద్ధి అవుతుంది.
 
4. చిగుళ్ల వాపు, నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి బాధలు ఉన్నప్పుడు జీలకర్ర పొడి, ఉప్పు, కరక్కాయ పొడి సమానంగా కలిపి చేసిన పళ్లపొడితో రోజూ పళ్లు తోముకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
5. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ పడుకునే ముందు ఒక స్పూన్ జీలకర్ర పొడిని అరటిపండులో కలుపుకుని తింటే బాగా నిద్ర పడుతుంది.
 
6. నేతిలో వేయించిన జీలకర్ర చూర్ణంలో తగినంత ఉప్పు కలిపి రెండు పూటలా తీసుకుంటే ఆడవారిలో బహిష్టు సమయంలో వచ్చే నొప్పి తగ్గి ఋతుక్రమం సక్రమంగా అవుతుంది. గర్బాశయ దోషాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

తర్వాతి కథనం
Show comments