Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనియాల కషాయంతో మధుమేహాన్ని నిరోధించవచ్చు...

కొత్తిమీర మెుక్కనుండి కాచే ధనియాల కాయలను ఎండబెట్టి ఆ తరువాత గింజల రూపంలో లేదా పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషక విలువలున్నాయి. వీటి వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (10:08 IST)
కొత్తిమీర మెుక్క నుండి కాచే ధనియాల కాయలను ఎండబెట్టి ఆ తరువాత గింజల రూపంలో లేదా పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషక విలువలున్నాయి. వీటి వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ధనియాలలో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
ధనియాల కషాయం రూపంలో తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఈ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కషాయాన్ని తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిచవచ్చని పరిశోధనలలో  చెప్పబడుతోంది. మధుమేహం రాకుండా నిరోధించడానికి ధనియాలు చక్కగా పనిచేస్తాయి. ఈ కషాయాన్ని తీసుకోవడం వలన మధుమేహం అదుపులో ఉంటుంది. 
 
టైఫాయిడ్‌కు కారణమయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే గుణాలు ధనియాల్లో అధికంగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆహారం వలన కలిగే అనారోగ్య సమస్యలకు ధనియాలు చక్కని పరిష్కారాన్ని చూపుతాయి. ధనియాల కషాయంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చును. అంటువ్యాధులకు కారణమయ్యే సూక్మక్రిములతో పోరాడే గుణాలు ధనియాల్లో పుష్కలంగా ఉన్నాయి. 
 
శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో ధనియాలు మంచి ఔషధంగా ఉపయోగపడుతాయి. ధనియాలను తీసుకోవడం వలన వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి. తద్వారా శరీరంలోని ఫ్రీరాడికల్స్ తగ్గుముఖం పడుతాయి. ధనియాల పొడిలో కొద్దిగా పసుపును కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments