Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు ఆస్తమాగా మారుతుందా? ఎలా?

చాలామంది జలుబుతో బాధపడుతున్నా ఆఫీసులకు వెళుతుంటారు. వీరివల్ల ఆఫీసులోని ఇతరులకు కూడా జలుబు సోకే ప్రమాదం ఉంది. పైగా, జలుబుకు సరైన చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే అది చివరకు ఆస్తమాగా మారే ప్రమాదముందన

Webdunia
శనివారం, 28 జులై 2018 (10:51 IST)
చాలామంది జలుబుతో బాధపడుతున్నా ఆఫీసులకు వెళుతుంటారు. వీరివల్ల ఆఫీసులోని ఇతరులకు కూడా జలుబు సోకే ప్రమాదం ఉంది. పైగా, జలుబుకు సరైన చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే అది చివరకు ఆస్తమాగా మారే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధారణ జలుబు అయినప్పటికీ దానిపట్ల శ్రద్ధ వహించాల్సిందేనని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
* సీజనల్ జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
* జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. 
* జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణుల చెపుతారు. 
* సాధారణంగా జలుబు 7 నుంచి 12 రోజుల్లో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం. 
* వేడి నీటిలో పసుపు లేదా ఏదైనా బామ్ వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. 
* చీదినప్పుడు, దగ్గినప్పుడు రక్తం పడుతుందా...? అని గమనించాలి. అలా రక్తం పడితే అది తీవ్రమైన రుగ్మతగా గమనించాలి. 
* స్వల్పంగా తలనొప్పి, జలుబు ఉన్నపుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం అన్నిటికంటే మించిన మార్గం లేదు. 
* తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. 
* తల, శరీరం నొప్పులు, జ్వరం వంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments