Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి కొబ్బరి తింటే ప్రయోజనాలు ఎన్నో.....

దేవునికి కొబ్బరి కాయను సమర్పించడం మన సంప్రదాయం. ఆ కొబ్బరిని ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే పచ్చడో లేక కొబ్బరన్నమో చేసుకొని తింటాం. ఈ పచ్చి కొబ్బరిలో పోషకాలు అపారం. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీన్లోని పోషకాలు అవయవ

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (12:39 IST)
దేవునికి కొబ్బరి కాయను సమర్పించడం మన సంప్రదాయం. ఆ కొబ్బరిని ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే పచ్చడో లేక కొబ్బరన్నమో చేసుకొని తింటాం. ఈ పచ్చి కొబ్బరిలో పోషకాలు అపారం. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీన్లోని పోషకాలు అవయవాలు చురగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకొనే వారికి ఇది చాలా మంచిది. 
 
కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది.  శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను బయటకు పంపేస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలోను కీలకపాత్ర పోషిస్తాయి. 
 
విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము కొబ్బరిలో పుష్కలంగా లభిస్తాయి. తరుచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి.  కొబ్బరి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments