Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొలకెత్తిన గింజలను పచ్చిగానే ఎందుకు తినాలి? మాంసాహారం తింటే?

మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. ఉడికించి తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలు కూడా లభిస్తాయి.

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (11:34 IST)
మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. ఉడికించి తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలు కూడా లభిస్తాయి. అలాకాకుండా ఉడకబెట్టినా, వేడి చేసినా వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. ఈ గింజలతో పచ్చి క్యారెట్లను కలిపి తింటే శరీరానికి కావాల్సిన బీటా కెరోటిన్‌ సమృద్ధిగా అందుతుంది. 
 
మొలకెత్తిన గింజలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మధ్యాహ్నం ఆహారంలో మాంసాహారం తీసుకుంటే సాయంత్రం స్నాక్స్‌లో మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మాంసాహారం నుంచి వచ్చే అధిక కొవ్వు బారి నుండి గింజలు మనల్ని రక్షిస్తాయని.. అలాగే మాంసంలోని కొవ్వును పీల్చుకోవడం ద్వారా దాన్ని శరీరంలోని ఇతర వ్యర్థపదార్థాలతో కలిపి బయటికి పంపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
మొలకెత్తిన గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా ఆకలి వేయదు. తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. శరీరం చురుగ్గా ఉండాలంటే వారంలో కనీసం ఒక్కసారైనా మొలకెత్తిన గింజల్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొలకలు తినడం ద్వారా గ్యాస్‌, ఎసిడిటీ తదితర సమస్యలు దూరమవుతాయని వారు చెప్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments