Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజీర పండును తినండి.. బరువు తగ్గించుకోండి..

అంజీర పండులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి శరీరానికి క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాలు అవసరం. అంజీర పండులో ఇవి సమృద్ధిగా ఉంటాయి. అంజీర పండ్లలోని క్యారటోన్లు, ల్యూటిన

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (11:29 IST)
అంజీర పండులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి శరీరానికి క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాలు అవసరం. అంజీర పండులో ఇవి సమృద్ధిగా ఉంటాయి. అంజీర పండ్లలోని క్యారటోన్లు, ల్యూటిన్‌, టాన్నిస్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు, కరిగిపోయే పీచు పదార్థం ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఈ పండ్లలో ఎ, ఇ, కే విటమిన్లు తగినంత స్థాయిలో ఉంటాయి ఈ పండ్లలో కేలరీలు కూడా చాలా తక్కువే. అంటే దాదాపు 100 గ్రాముల పండ్లలో 74 కేలరీలే ఉంటాయి. 
 
ఎప్పుడూ ఆకలితో ఉంటూ, కనిపించిన ప్రతి ఆహార పదార్థాన్నీ ఆబగా తినేస్తూ కొందరు ఊబకాయాన్ని తెచ్చుకుంటారు. అలాంటి వారు అంజీర పండ్లను తింటే, వాటిలోని పీచుపదార్థం, క్యాల్షియం, ఐరన్‌ ఆకలిని తగ్గించడం ద్వారా క్రమంగా బరువును తగ్గిస్తాయి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వు తక్కువగానూ, నీరు ఎక్కువగానూ ఉంటాయి. ఇది కూడా బరువు నియంత్రణలో ఉండడానికి తోడ్పడుతుంది.
 
అంజీర ఎండు పండ్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల హృద్రోగ నివారణకు తోడ్పడతాయి. ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments