Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే...

హైటెక్ జీవన విధానంలో లేట్‌నైట్‌ డిన్నర్‌ అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల అజీర్తి సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి, మధుమేహం, ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (14:50 IST)
హైటెక్ జీవన విధానంలో లేట్‌నైట్‌ డిన్నర్‌ అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల అజీర్తి సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి, మధుమేహం, ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే, రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. 
 
పైగా, రాత్రి వేళల్లో తొందరగా తినే వారిలో శక్తిస్థాయి పెరిగి.. పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు తింటే లేని రోగాలనుకొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. 
 
పగటి వేళ జీవక్రియ వేగంగా జరుగుతుంది. రాత్రివేళ జీవక్రియ రేటు తగ్గుతుంది. వైద్యనిపుణుల సూచన ప్రకారం రాత్రి ఆరు గంటలకే భోజనం చేస్తే ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం ఎంత మాత్రం మంచిది కాదనీ, లేట్‌ నైట్‌ పనిచేసేవారు, నైట్‌ షిఫ్ట్స్‌లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు 8 లోపే భోజనం చేయాలని చెపుతున్నారు. 
 
అయితే, రాత్రిపూట తినే ఆహారం లైట్‌గా ఉండాలనీ, బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌, నూడుల్స్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ రాత్రిపూట తీసుకుంటే అనారోగ్య సమస్యలను అంతా ఫాస్ట్‌గా తెచ్చుకున్నట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే భోజనం చేశాక పది నిమిషాల పాటు వాకింగ్ చేస్తే జీవక్రియ వేగం పెరుగుతుందని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments