Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర దోసను తొక్కతో తినేస్తే...?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (16:34 IST)
సాధారణంగా కీరా దోసకాయ తినేటప్పుడు ప్రతి ఒక్కరు తొక్కను తీసి తింటారు. తొక్క తీసి వేయడం వల్ల దానిపై చేరిన వాతావరణ కాలుష్య పదార్థాలు తొలగిపోతాయి. అయితే వీటితో పాటుగా ఎన్నో అత్యవసర పోషకాలు కూడా తొలగిపోతాయి. అలాకాకుండా కొంచెం నీటిలో ఉప్పు వేసి కీరదోసని కాసేపు ఆ నీటిలో ఉంచి శుభ్రంగా కడిగి తొక్కతో సహా కీరదోసని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.
 
1. కీరా తొక్కలో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. ఇది నీటిలో కరుగదు కనుక మన జీర్ణనాళంలో నుండి నెట్టివేయబడుతుంది. జీర్ణం కాని వ్యర్ధాలు అధికంగా తయారుకావటం వలన మలబద్దకం దరిచేరదు.
 
2. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా రోజుకు 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. పురుషులలో ఇది 39 గ్రాములు. కీరా లోపల ఉండే పీచు పదార్ధం నీటిలో కరిగిపోతుంది. ఇది కూడా శరీరానికి మేలు చేస్తుంది. ఇది విసర్జకాలను మృదువుగా మారుస్తుంది. 
 
3. కీరాలో ఉండే విటమిన్ కెలో చాలా భాగం చెక్కులోనే ఉంటుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒక కప్పు చెక్కులో 49 మైక్రో గ్రాముల విటమిన్ కె ఉంటుంది. అదే తొక్క తీసిన కీరాలో ఇది 9 మైక్రో గ్రాములు మాత్రమే ఉంటుంది.
 
4. కీరాను ఎప్పుడు కావాలంటే  అప్పుడు తినేయవచ్చు, ఎందుకంటే, వీటిలో సహజంగా కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఒక కీరా ముక్కలో 1-2 కెలోరీలు ఉంటాయి.  డైటింగ్ చేస్తున్నప్పటికి, మధ్యాహ్న సమయాల్లో కొన్ని తొక్క తీయని కీరా ముక్కలు తినడం వలన ఎటువంటి నష్టం వుండదు. 
 
5. కీరా చెక్కులో బీటా కెరోటిన్, విటమిన్ ఎ వుంటుంది. ఇది మన కళ్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. విటమిన్ ఎ వివిధ సమ్మేళనాలలో లభిస్తుంది. కీరా చెక్కులో ఇది అధికంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments