Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నంపై ఉండే అపోహలు...

దేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మంది

Webdunia
గురువారం, 5 జులై 2018 (09:41 IST)
దేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మందికి పలు అపోహలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* సాధారణంగా రాత్రిపూట చాలా మంది అన్నంకు బదులు చపాతీ, టిఫన్ వంటివి తీసుకుంటుంటారు. వీటికంటే అన్నం ఆరగించడమే ఉత్తమమని వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే.. అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. దీంతో లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. 
 
* మన శరీరంలో శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతోపాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కనుక రాత్రి పూట నిర్భయంగా అన్నం తినవచ్చు.  
 
* ముఖ్యంగా దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా రాత్రిళ్లు అన్నం మానేసి చపాతీలు, వివిధ రకాల రొట్టెలు ఆరగిస్తుంటారు. నిజానికి మధుమేహం ఉన్న వారు నిర్భయంగా అన్నం తినవచ్చు. 
 
* తక్కువ మోతాదులో అన్నం తినడంతోపాటు దాంట్లో పప్పులు, కూరగాయలు, నెయ్యి వంటి ఆహారాలను చేర్చుకుంటే భోజనం చేసిన వెంటనే షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటిస్ ఉన్నవారు కూడా అన్నంతిన్నట్టయితే చక్కెర నిల్వల స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని చెపుతున్నారు. 
 
* అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. నిత్యం మనం తినే జంక్‌ఫుడ్, నూనె పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్లే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే అన్నం ఆరగించడమే ఉత్తమం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

తర్వాతి కథనం
Show comments