Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (09:22 IST)
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం కలుగుతుంది. దాహాన్ని తీర్చడమేకాకుండా ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాలు జీర్ణక్రియ, చర్మ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే, వారానికి మూడు రోజులు కొబ్బరి నీళ్లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 
 
మలబద్ధకం, గ్యాస్ లేదా అసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే సహజ ఎంజైమ్‌లు కలిగి ఉంటుంది. ఇవి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపండి ద్వారా ప్రేగులను శుభ్రపరుస్తుంది. 
 
చర్మం ప్రకాశవంతంగాను, యవ్వనంగా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, చర్మం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్ళు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇది నీరసాన్ని తొలగిస్తుంది. ముడతలు ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. 
 
చర్మానికి సహజ మెరుపును ఇచ్చి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మూతపిండాలు, మూత్ర నాళాలు ఆరోగ్యంగా ఉంచుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా రక్షించే సహజ పానీయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments