Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్క చేర్చి...

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (21:06 IST)
ఇంగువ వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం. కూరలు, వేపుళ్లు చేసినప్పుడు తాలింపులో కాస్త ఇంగువ వేయడం జరుగుతుంది. అదనపు రుచి, వాసన కోసం ఉపయోగించే ఇంగువలో మన శరీరానికి మేలు చేసే పోషకాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇందులో కాల్షియం, పాస్పరస్, ఇనుము, విటమిన్- బి లాంటి ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. మరి ఇంగువ వలన మన ఆరోగ్యానికి జరిగే మేలేమిటో చూద్దాం.
 
1. ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. ఇది ఋతు సమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్ధం.  
 
2. అజీర్తితో బాధపడేవారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
 
3. ఒక చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది. జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. అంతేకాకుండా  శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
 
4. క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్‌ సమస్య బాధించదు.
 
5. రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి. అంతేకాకుండా నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది.
 
6. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది.
 
7. మానసిక సమస్యలూ, ఒత్తిళ్ల కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికారక హార్మోన్లతో పోరాడే శక్తి ఇంగువలోని పోషకాలకు ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

తర్వాతి కథనం
Show comments