Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో గ్యాస్... అబ్బ, తగ్గే మార్గమేంటి?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (22:29 IST)
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎసిడిటీ సమస్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్య కారణంగా కడుపు ఉబ్బరం, చాతీలో మంట, కడుపునొప్పి లాంటి అనేక రకములైన ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. దీనికి మందులు వాడినా ఉపశమనం కలుగుతుంది కానీ... పూర్తిగా నయం అవ్వదు. అంతేకాకుండా మందులు ఎక్కువగా వాడడం వల్ల వేరే రకములైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాకాకుండా మన ఇంట్లో ఉన్న పదార్దాలతోనే గ్యాసు సమస్యని తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. గ్యాస్ సమస్య ఉన్నవారు ముఖ్యంగా హోటల్స్‌లో నూనెతో చేసిన పదార్థాలను పూర్తిగా వదిలేయాలి. మసాలాలు తగ్గించి తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున రాగి పాత్రలో నీటిని లీటరుకు తగ్గకుండా తీసుకోవాలి.
 
2. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం,మరియు ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను నివారించుకోవచ్చు.
 
3. ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని ఉదయం సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.
 
4. కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్బుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు వేడినీటిలో కలుపుకుని తాగడం వలన ఉదర భాగంలో ఏర్పడే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. 
 
5. బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధిత వికారాలు తగ్గిపోతాయి.
 
6. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యనుతగ్గించుకోవచ్చు.
 
7. అలాగే పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసీ మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. వీటితో పాటు చల్లటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం మరియు నొప్పి తగ్గుముఖం పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ నీతులు చెప్పడం హాస్యాస్పదం : అద్దంకి దయాకర్

వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్

మానసిక సమస్యతో బాధపడుతున్న కొడుకును చూడలేక....

మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై విద్యార్థుల దాడి

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

తర్వాతి కథనం
Show comments