Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వులను ఎందుకు తీసుకోవాలో తెలుసా? (video)

Webdunia
గురువారం, 2 జులై 2020 (22:19 IST)
ఈమధ్య కాలంలో నువ్వుల నూనెను బాగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని పైటేట్ అనే యాంటీ ఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వుల్లోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మధుమేహం, బీపీలను నివారిస్తుంది.
 
2. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడతాయి. ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
 
3. వీటిల్లో అధిక మోతాదులో ఉండే కాపర్, కీళ్లు, కండరాల నొప్పుల్నీ మంటల్ని తగ్గించడంతో పాటు శరీరమంతా ఆక్సిజన్ సరఫరాకు తోడ్పడుతుంది.
 
4. నువ్వుల్లోని సెసమాల్ అనే కర్బన పదార్థం, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో రేడియేషన్ కారణంగా కణాల్లోని డిఎన్ఎ దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఆస్త్మా రోగుల్లో శ్లేష్మాన్ని హరిస్తాయి. నిద్రలేమిని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 
5. పాలిచ్చే తల్లులకు రోజూ కొంచెం నువ్వులు పెడితే పాలు పడతాయి. ప్రతిరోజూ ఒక నువ్వుల ఉండ తినడం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది.
 
6. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి నువ్వులు మంచి ఔషధంలా పని చేస్తాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. నువ్వులనూనెను ఒంటికి మర్దనా చేసుకోవడం వలన కూడా కీళ్లనొప్పులు తగ్గుతాయి.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

తర్వాతి కథనం
Show comments