Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే పిస్తా పప్పు తినకుండా వుండరు...

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (18:11 IST)
పిస్తా పప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకములైన ఔషధ గుణాలు ఉన్నాయి. పోషకాలతో పాటు విటమిన్ బి6, ఫైబర్, పాస్పరస్, కాపర్, పొటాషియం ఉన్నాయి. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది. పిస్తా పప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
 
1. ఇది శరీరంలోని ఊపిరితిత్తులకు మరియు ఇతర శరీర అవయవాలకు ప్రాణవాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
 
2. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
3. పిస్తాపప్పు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ని పెరిగేలా చేస్తుంది. అందువల్ల గుండె జబ్బుల సమస్యలు తగ్గుతాయి. ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
 
4. రోజూ పిస్తాను తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్ 'ఇ'ను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి చర్మాన్ని సంరక్షిస్తుంది. అంతేకాకుండా కంటి సమస్యలతో బాధపడేవారికి పిస్తా మంచి ఫలితాన్నిస్తుంది. ఇందులోని కెరోటినాయిడ్లు మరియు లూటిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటిలోని కణాలను పునరుద్దరించి కంటి చూపు స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
 
5. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర  పోషిస్తాయి. ఇది శరీరాన్ని అనేక శారీరక రుగ్మతల నుండి దూరం చేస్తుంది. ఇది శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments