Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న వయసులోనే తెల్లజుట్టు... నల్లగా మారాలంటే ఏం చేయాలి?

Effective
Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (21:36 IST)
ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలా మందిని వేదిస్తున్న సమస్య జుట్టు తెల్లబడడం. మనం తీసుకునే ఆహారం, వాతావరణ కాలుష్యం మరియు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరుగవచ్చు. సహజ పద్దతుల్లో కొన్ని చిట్కాల ద్వారా మనం ఈ సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. ఉసిరిపొడి చేసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ తలకు రాసుకుని రెండు గంటలాగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
 
2. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ ఈరసం తలకు రాసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.
 
3. ఉల్లిగడ్డను మెత్తగా మిక్సీ వేయాలి. ఈ పేస్టును తెల్ల వెంట్రుకలు ఉన్నచోట రాయాలి. రెండు గంటలు ఆగిన తరువాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచుగా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
4. నువ్వులను మిక్సీలో వేసి పేస్టు చేయాలి. ఇందులో బాదం ఆయిల్ కలిపి దీనిని తరచూ తలకు రాస్తుండాలి. ఇలా చేయడం వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
 
5. అలాగే ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వలన కూడా జుట్టు నల్లబడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్ బి12 ఎక్కువగా ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments