ఇకపై గర్భనిరోధక మాత్రలు అక్కర్లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగం...

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (12:19 IST)
అవాంఛిత గర్భాలను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సరికొత్త వైద్య విధానాన్ని అమల్లోకి తీసుకునిరానుంది. ఈ విధానం అమల్లోకి వస్తే గర్భనిరోధక మాత్రలతో పనిలేదు. ఈ మాత్రల స్థానంలో నాలుగు సెంటీమీటర్ల పొడవుతో సూదిలా ఉండే సాధనాన్ని మోచేతి చర్మ కింద పైపొరలో అమర్చుతారు. ఇది గర్భాన్ని నిరోధించే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగించనున్నారు. ఈ సాధనాలను కేంద్రం ఉచితంగా సరఫరా చేయనుంది. అవాంఛిత గర్భాలతో పాటు ఒక కాన్పు తర్వాత మరో కాన్పుకు ఎక్కువ సమయం కోరుకునేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
 
అయితే, సంతానం కావాలని కోరుకున్నపుడు ఈ సాధనాన్ని సులభంగా తొలగించి, గర్భందాల్చవచ్చని వారు వివరణ ఇస్తున్నారు. ఈ విధానాన్ని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టెవ్ ఇంప్లాంట్‌గా పిలుస్తారు. ఈ సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను పంపిణీ చేయనున్నారు. 
 
స్టాఫ్ నర్సులు కూడా సులభంగా అమర్చేలా శిక్షణ ఇస్తారు. పైగా, దీన్ని అమర్చుకోవడం వల్ల ఎలాంటి అసౌకర్యం కూడా కలగదని వైద్యులు చెబుతున్నారు. ఈ సాధనం తొలగించిన 48 గంటల తర్వాత గర్భందాల్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ తరహా విధానం కెన్యాలో గత రెండున్నర దశాబ్దాలుగా అమల్లో వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments