Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్లను అతిగా వాడుతున్నారా? ఐతే హ్యాపీ హుష్ కాకి

స్మార్ట్‌ఫోన్లను అతిగా వాడుతున్నారా? అయితే ఆనందం కోల్పోతున్నట్టే. స్మార్ట్‌ఫోన్ల వాడకంలో యువత ముందుంటోంది. ఛాటింగ్ పేరుతో గంటలతరబడి స్మార్ట్ ఫోన్లు వాడితే.. ఆనందాన్ని.. సంతోషాన్ని కోల్పోతారని యువతపై య

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (10:20 IST)
స్మార్ట్‌ఫోన్లను అతిగా వాడుతున్నారా? అయితే ఆనందం కోల్పోతున్నట్టే. స్మార్ట్‌ఫోన్ల వాడకంలో యువత ముందుంటోంది. ఛాటింగ్ పేరుతో గంటలతరబడి స్మార్ట్ ఫోన్లు వాడితే.. ఆనందాన్ని.. సంతోషాన్ని కోల్పోతారని యువతపై యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాకు చెందిన పరిశోధకులు తెలిపారు. సుమారు 10 లక్షలకు పైగా అమెరికన్ టీనేజర్లపై నిర్వహించిన ఈ సర్వేలో విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లపై అధిక సమయం వెచ్చిస్తున్నారని తెలిసింది. 
 
అయితే స్మార్ట్ ఫోన్లు వాడే టీనేజర్లలో సంతోషం గల్లంతవుందని.. కంప్యూటర్‌ గేమ్స్‌, సోషల్‌ మీడియా, మెసేజ్‌, వీడియో చాటింగ్‌ వంటి వాటిల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్న యువత కంటే ఇతరులతో సత్సంబంధాలు నెరపుతున్న యువత సంతోషంగా వుంటోందని వెల్లడైంది. దీంతో సోషల్‌ మీడియా అధికంగా ఉపయోగించడం వల్ల యువతలో సంతోషం కనుమరుగు అవుతోందని తేల్చారు.
 
అందుకే పరిశోధకులు ఏమంటున్నారంటే.. గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కు పోకుండా నేరుగా స్నేహితులతో మాట్లాడడం, ఆటలాడడం, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాను పరిమితంగా వాడితేనే సంతోషం లేకుంటే హ్యాపీ హుష్ కాకి అంటూ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments