Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ ట్యాంకుల్లోనే 86 శాతం ప్రాణాంతక దోమలు

పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి ఇంటిపై మంచినీటి ట్యాంకులు ఉంటాయి. ఈ ట్యాంకుల్లో వివిధ రకాలో దోమలు చేరివుంటాయి. వీటిలో 86 శాతం ప్రాణాంతక దోమలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా తయారు చేసిన ఓ నివేదికలో పేర్కొంద

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (13:26 IST)
పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి ఇంటిపై మంచినీటి ట్యాంకులు ఉంటాయి. ఈ ట్యాంకుల్లో వివిధ రకాలో దోమలు చేరివుంటాయి. వీటిలో 86 శాతం ప్రాణాంతక దోమలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా తయారు చేసిన ఓ నివేదికలో పేర్కొంది.
 
సాధారణంగా దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వస్తుంటాయి. ఈ దోమ‌ల్లో 86 శాతం మంచినీళ్ల ట్యాంకుల్లోనే ఉంటున్నట్లు పేర్కొంది. టెర్రస్‌పైన ఉండే ట్యాంకులు, ప్లాస్టిక్ డ్రమ్స్, డిసర్ట్ కూలర్స్, ప్లవర్ పాట్స్, ఐరన్ కంటైనర్లు, కనస్ట్రక్షన్ సైట్లలోనే ఈ దోమ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్లు తెలిపింది. 
 
ప్రాణాంతక దోమ‌లు అధికంగా ప్లాస్టిక్ డ్రమ్స్లో 41 శాతం ఉంటున్నాయ‌ని తెలిపింది. డిసర్ట్ కూలర్స్లో 12 శాతం, కనస్ట్రక్షన్ సైట్స్లో ఎక్కువగా వాడే ఐరన్ కంటైనర్లలో 17 శాతం ఉంటున్న‌ట్లు పేర్కొంది. ఈ యేడాదిలో గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు 12,225 చికెన్ గున్యా కేసులు, 27,879 డెంగ్యు కేసులు నమోదైనట్టు పేర్కొంది. వచ్చే రెండు నెలల్లో ఈ వ్యాధుల బారిన ప‌డే వారి సంఖ్య‌ మరింత పెరుగనుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేసింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కీలక నిర్ణయం...

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఇకలేరు...

OpenAI నుంచి ఎలెన్ మస్క్ తప్పుకోవడానికి కారణం ఏంటి?

మృతురాలి కుటుంబానికి రూ.9 కోట్లు చెల్లించాలి : ఏపీఎస్ ఆర్టీసీకి సుప్రీం ఆదేశం

మేడారంలో ప్రారంభమైన సమ్మక్క-సారలమ్మ జాతర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎనర్జీకి బన్నీ ఫర్ఫెక్ట్ మ్యాచ్ : రష్మిక మందన్నా

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

తర్వాతి కథనం
Show comments