Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటున్నారా? కేన్సర్ కారకాలున్నాయ్ జాగ్రత్త సుమా!

బిర్యాని అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి. చాలామంది ఇష్టపడే బిర్యానీలో ఘుమఘుమల కోసం పశ్చిమ బెంగాల్‌లో ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు ఇటీవలే తేటతెల్లమైంది. దీనితో బిర్యానీ ప్రియులు ఖంగుతిన్నారు.

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (10:29 IST)
బిర్యాని అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి. చాలామంది ఇష్టపడే బిర్యానీలో ఘుమఘుమల కోసం పశ్చిమ బెంగాల్‌లో ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు ఇటీవలే తేటతెల్లమైంది. దీనితో బిర్యానీ ప్రియులు ఖంగుతిన్నారు. ఇటీవల చిన్నాపెద్దా తేడా లేకుండా అందరు తినే బ్రెడ్‌పై జరిపిన పరీక్షల్లో కేన్సర్ కారక రసాయనాలు అయిన పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడెట్ బయటపడ్డాయని సీఎస్ఈ నిర్ధారించిన విషయం విదితమే. 
 
అయితే ఈ రసాయనాలు నోరూరించే బిర్యానీలో కూడా ఉన్న‌ట్లు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) అధికారులు తేల్చి చెబుతున్నారు. బిర్యానీ తయారీలో సింథటిక్ రసాయనాలను ఉపయోగిస్తున్నారని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చేసిన తనిఖీలలో తేటతెల్లమైంది. నగరంలో పలురెస్టారెంట్లు, డాబాలలో తీసుకున్న బిర్యానీలపై పరీక్ష నిర్వహించారు. 
 
పరీక్షల్లో తేలిందేమిటంటే... బిర్యానీ తాజాగా ఉండడం కోసం దానిలో కేన్సర్ కారక మెటానిల్ ఎల్లో అనే రసాయనం వాడుతున్నట్లు నిర్ధార‌ణ అయింది. బిర్యానీ బియ్యం ఎక్కువగా పసుపు రంగులోకి మారడానికి యజమానులు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు... సాధారణంగా బిర్యాని బియ్యం పసుపు రంగు మారడానికి ఎక్కువగా కుంకుమ పువ్వును వాడుతారు. 
 
కాని దీని ధర ఎక్కువ కావడంతో కుంకుమపువ్వుకు బదులుగా ఈ రసాయనాన్ని చౌకగా కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారని, ఇది కేన్సర్ కారకం అని ఫుడ్ నిపుణులు వెల్లడించారు. బిర్యానీలో రసాయనాల వాడకంపై మున్సిపల్ అధికారులు ఈ మధ్యనే ఆహార సంస్థకు నివేదికలను పంపించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలోని 457 అంగన్‌వాడీలలో రిలయన్స్ ఫౌండేషన్ ‘కహానీ కళా ఖుషీ’ ప్రచారం

కత్తితో పొడిచి మందుబాబు పరార్.. వీపులో కత్తి నాటుకుపోయింది.... (video)

ప్రస్తుత ఇసుక విధానం ఏమీ బాగోలేదు: కూటమి ప్రభుత్వానికి జ్యోతుల నెహ్రూ షాక్

కాకినాడ సుబ్బయ్య హోటల్‌‌ ఫుడ్‌లో కాళ్ల జెర్రీ... ఎలా సీజ్ చేశారంటే? (video)

డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ తో మూవీ తర్వాతే కంగువ 2 చేస్తాం, దీపిక పడుకోన్ నాయిక కాదు : కేఈ జ్ఞానవేల్ రాజా

240 దేశాలలో షో ప్రసారం కావడం హ్యాపీగా వుంది : రానా దగ్గుబాటి

సాహిబా లో ఫోటోగ్రాఫర్ గా విజయ్ దేవరకొండ

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవంలో రామ్ చరణ్

జయం రవి విడాకుల కేసు : రాజీకి ప్రయత్నించండి.. చెన్నై ఫ్యామిలీ కోర్టు

తర్వాతి కథనం
Show comments