Webdunia - Bharat's app for daily news and videos

Install App

3-4 సార్లు శృంగారంలో పాల్గొంటే కిడ్నీలోని రాళ్లు మాయం

చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరు ఆపరేషన్ చేయించుకుని ఆ రాళ్లను తీసేయించుకుంటారు. ఇంకొందరు ఆయుర్వేద మందులు వాడి శరీరంలోనే కరిగించుకునేందుకు ప్రయత్నిస్తుం

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (08:50 IST)
చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరు ఆపరేషన్ చేయించుకుని ఆ రాళ్లను తీసేయించుకుంటారు. ఇంకొందరు ఆయుర్వేద మందులు వాడి శరీరంలోనే కరిగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
వైద్యులు చేసిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైంది. అదేమిటంటే.. కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే శృంగారమే బెస్ట్ మెడిసన్ అని చెపుతున్నారు. వారంలో మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటే చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని చెబుతున్నారు. 
 
ఈ పరిశోధనలో భాగంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న మగవారిని మూడు బృందాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లోని వారిని వారంలో మూడుసార్లు శృంగారంలో పాల్గొనాల్సిందిగా సలహా ఇచ్చారు. రెండో గ్రూప్‌లోని వారికి యూరినేషన్‌ పెంచే మందులను, మూడో గ్రూప్‌వారికి రాళ్లను కరిగించే మెడిసిన్‌ సూచించారు. 
 
రెండువారాల తర్వాత రెండు, మూడు గ్రూప్‌లోని వారికంటే మొదటి బృందంలోని వారిలో ఈ రాళ్ల సమస్య గణనీయంగా తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ బృందంలో 31 మంది ఉండగా, 26 మందిలో కిడ్నీలో రాళ్లు పూర్తిగా తొలిగిపోయాయని వారు పేర్కొన్నారు. 
 
కిడ్నీలో ఏర్పడే చిన్నసైజు రాళ్లు (6 మిల్లీమీటర్ల కంటే తక్కువ మందం కలిగినవి) శృంగారం వల్ల వెలుపలకు వచ్చేసే అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. మొత్తానికి కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వాళ్లు వారంలో కనీసం మూడుసార్లు శృంగారంలో పాల్గొంటేచాలని తేల్చారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments