Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేళాపాళా లేకుండా తింటున్నారా.. లావయిపోతారు

వేళకు తినే అలవాటుకు భిన్నంగా ఎప్పుడంటే అప్పుడు, ఇష్టమొచ్చినప్పుడు తింటున్నారా.. అయితే లావయిపోతారు జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. బరువు తగ్గాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత తిన్నామన్నది కాకుండా ఏ సమయంలో తింటున్నామన్నది ముఖ్యమంటున్నారు. దీనికోసం ఎలుక

Webdunia
శనివారం, 22 జులై 2017 (06:47 IST)
వేళకు తినే అలవాటుకు భిన్నంగా ఎప్పుడంటే అప్పుడు, ఇష్టమొచ్చినప్పుడు తింటున్నారా.. అయితే లావయిపోతారు జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. బరువు తగ్గాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత తిన్నామన్నది కాకుండా ఏ సమయంలో తింటున్నామన్నది ముఖ్యమంటున్నారు. దీనికోసం ఎలుకలపై వారు చేసిన ప్రయోగం వారి ఊహను అద్భుతంగా నిర్ధారించింది.
 
బరువు తగ్గించుకునేందుకు మనలో చాలామంది కడుపు కట్టేసుకుంటూ ఉంటారు కదా.. ఇలాంటివాళ్లు ఎంతో కొంత వేళకు తినడం మంచిదని సూచిస్తున్నారు యూటీ సౌత్‌వెస్టర్న్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. . ఒంటి బరువు తగ్గించుకోవాలంటే.. ఎంత తిన్నామన్నది కాదు.. ఎప్పుడు తిన్నామన్నది ముఖ్యం అంటున్నారు ఆహారం తక్కువైతే ఆయుష్షు పెరుగుతుందనడానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. 
 
కొన్ని ఎలుకలకు అవి చురుగ్గా ఉన్నప్పుడు నిర్ణీత సమయానికి ఆహారం ఇవ్వగా.. మిగిలిన వాటికి అవి విశ్రాంతి తీసుకునే సమయంలో ఇచ్చారు. రెండు గుంపుల్లోని ఎలుకలకు అందించిన కేలరీలు మాత్రం సమానం. అయితే కొంతకాలం తర్వాత వేళకు తిన్న ఎలుకల బరువు తగ్గగా, మిగిలిన వాటిల్లో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఇంకో ప్రయోగంలో కొన్ని ఎలుకలకు పగలు కావాల్సినంత తిండిపెట్టి.. ఇంకొన్నింటికీ 30 శాతం తక్కువ కేలరీలతో వేళాపాళా లేకుండా ఆహారం అందించారు. ఇక్కడ కూడా సమయానికి తిన్న ఎలుకల బరువు తగ్గగా, వేళాపాళా లేకుండా తిన్న ఎలుకలు మాత్రం బరువెక్కాయి. 
 
ఈ ప్రయోగాలను బట్టి.. బరువు తగ్గాలంటే.. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎంత తిన్నామన్నది కాకుండా ఏ సమయంలో తింటున్నామన్నది ముఖ్యమని అర్థమవుతోంది. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments