Webdunia - Bharat's app for daily news and videos

Install App

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

సెల్వి
శనివారం, 15 ఫిబ్రవరి 2025 (14:52 IST)
GBS Virus
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. 
 
దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు. 
 
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) నెమ్మదిగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి క్రమంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్‌ వ్యాధితో చనిపోయిన విషయం తెలియడంతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం సృష్టిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. 
 
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్‌ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు.
 
వ్యాధి లక్షణాలు 
ఈ ‌వ్యాధి వచ్చిన వారు ఒళ్లంతా తిమ్మిరిగా మారుతుంది. 
కండరాలు బలహీనంగా ఉంటాయి. 
డయేరియా, పొత్తికడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

తర్వాతి కథనం