Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

ఐవీఆర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (23:23 IST)
నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్‌లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల అత్యాధునిక ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇసావోట్ నుండి ఆయన ఆసుపత్రికి వచ్చిన ఈ ఎంఆర్ఐ, హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో రోగులకు అందించే సంరక్షణ ప్రమాణాన్ని మరింత పెంచింది. ఈ అధునాతన రోగనిర్ధారణ సాంకేతికత యంత్రం వల్ల మస్క్యులోస్కెలెటల్, మృదు కణజాల ఇమేజింగ్ యొక్క ఖచ్చితత్వం, సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచటంతో పాటుగా రోగులకు మరింత ఖచ్చితమైన రోగనిర్ధారణ మరియు మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది.
 
పొడియాట్రిక్ కేర్‌లో అత్యాధునిక ఆవిష్కరణలకు ఖ్యాతి గడించిన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా, ఈ కొత్త ఎంఆర్ఐ గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ "ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషిన్ పాడియాట్రిక్ రోగులకు ఒక గేమ్-ఛేంజర్ కానుంది. ఇది తొలిదశలోనే సంక్లిష్ట పరిస్థితులను నిర్ధారించి మెరుగైన చికిత్స అందించటానికి ఉపయోగపడుతుంది. ప్రభావవంతమైన చికిత్స, రోగికి సానుకూల ఫలితాలను తీసుకురావటంలో ఇది కీలకం. ఈ మెషీన్‌తో, మేము మా రోగులకు వేగవంతమైన, మరింత ఖచ్చితమైన ఇమేజింగ్‌ను అందించగలము. తద్వారా చికిత్సలు, ఖచ్చితమైన సమాచారంతో నిర్ణయాలు తీసుకోవటంలో మాకు సహాయపడుతుంది" అని అన్నారు.
 
ఇసావోట్ ఆసియా పసిఫిక్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రీ బిజినెస్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ నాసా మాట్లాడుతూ, "ఇసావోట్ యొక్క విప్లవాత్మక ఓ -స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంలో డాక్టర్ నరేంద్రనాధ్ మేడాతో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అత్యాధునిక సాంకేతికత పొడియాట్రిక్ చికిత్స తీరును మార్చటంలో అత్యంత కీలకం కానుంది. పాదాల, చీలమండ పరిస్థితులు నిర్ధారణలో అసమానమైన ఖచ్చితత్వాన్ని, వేగవంతమైన రోగనిర్ధారణ పరిస్థితులను అందిస్తుంది, చివరికి రోగుల సంరక్షణ, చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలకు వైద్యపరమైన ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఇసావోట్ ఎంఆర్ఓ ద్వారా కట్టుబడి ఉన్నాము. భారతదేశంలో పొడియాట్రిక్ కేర్‌లో ఒక ముఖ్యమైన ముందడుగుగా ఇది నిలుస్తుంది " అని అన్నారు. 
 
దాని సాటిలేని ఇమేజింగ్ సామర్థ్యాలతో పాటు, ఓ -స్కాన్ ఎంఆర్ఐ ఒక పేషంట్‌కు అనుకూల సమన్వయము, క్రమబద్దీకరించబడిన వర్క్‌ఫ్లో మరియు గణనీయంగా తగ్గిన స్కాన్ టైమ్‌లను అందిస్తుంది, ఇది డాక్టర్లకు మరియు రోగులకు స్పష్టమైన సమాచారం అందిస్తుంది. మస్క్యులోస్కెలెటల్ సమస్యలను తెలుసుకోవడం, మృదు కణజాల పరిస్థితులు ఇంటర్నల్ పరిస్థితి గుర్తించడం వరకు ఈ సాంకేతికత విస్తృత శ్రేణి రోగనిర్ధారణ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది.
 
ఇసావోట్ యొక్క ఓ-స్కాన్ ఎంఆర్ఐని ఉపయోగించడం వల్ల రోగికి ప్రయోజనాలు
ఇసావోట్ యొక్క ఓ-స్కాన్ ఎంఆర్ఐ అనేది రోగులకు, డాక్టర్లకు అనేక ప్రయోజనాలను అందించే ఒక అత్యాధునిక రోగనిర్ధారణ సాధనం. దీని వినూత్న లక్షణాలు రోగులు వారి రోగనిర్ధారణ ప్రక్రియలో అత్యధిక నాణ్యత సంరక్షణ, సౌకర్యం మరియు ఖచ్చితత్వాన్ని పొందేలా చూస్తాయి. ఈ ఎంఆర్ఐ వలన కలిగే ప్రయోజనాలు.. 
 
1. ఖచ్చితమైన రోగనిర్ధారణ కోసం అత్యున్నత నాణ్యత కలిగిన ఇమేజింగ్
2. రోగికి మెరుగైన సౌకర్యం 
3. మెరుగైన రోగి విశ్వాసం మరియు మనశ్శాంతి
 
స్పష్టమైన ఇమేజింగ్, తక్కువ స్కాన్ సమయాలు, మెరుగైన సౌలభ్యం మరియు తక్కువ ఇన్వాసివ్‌నెస్‌ని అందించడం ద్వారా, ఓ -స్కాన్ ఎంఆర్ఐ ద్వారా ఎంఆర్ఐ చేయించుకునే రోగులు సౌకర్యవంతంగా మరియు రిస్కులేని అత్యధిక ప్రమాణాలు సంరక్షణను పొందగలరని నిర్ధారిస్తుంది. ఇది మెరుగైన ఫలితాలు మరియు సంతృప్తిని కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

తర్వాతి కథనం
Show comments