Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ షాపింగ్‌కు వ్యతిరేకంగా 14న మెడికల్‌షాపుల బంద్

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2015 (16:28 IST)
ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయాన్ని ఖండిస్తూ ఈనెల 14వ తేదీన దేశ వ్యాప్త బంద్‌కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ (ఏఐవోసీడీ) ప్రకటించింది. ఫలితంగా ఆ రోజున దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. 
 
సాధారణ ప్రజానీకం ఆరోగ్యంతోపాటు సభ్యుల ప్రయోజనాలను పరిరక్షించేందుకే ఈతరహా కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆ సంఘం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంఘానికి దేశంలో 7 లక్షల మంది సభ్యులున్నారు. 
 
ఇదే అంశంపై ఏఐవోసీడీ అధ్యక్షుడు జేఎస్ షిండే మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలను కేంద్రం తక్షణం నిషేధించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 ప్రకారం.. ఇంటర్నెట్ ద్వారా మందులు విక్రయించడం చట్టవ్యతిరేకమన్నారు. 
 
ఈ-ఫార్మసీ వ్యాపారంపై తామిచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని షిండే అన్నారు. దీంతో దేశంలోని 8 లక్షల మంది కెమిస్ట్‌లు, 80 లక్షల మంది కార్మికులు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలపై ప్రభావం పడుతున్నదని ఆయన అన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments