Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రక్త పరీక్షతో ఎన్నేళ్లు జీవిస్తామో తెలుసుకోవచ్చట!

అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త అంశాన్ని కనుగొన్నారు. ఒక రక్త పరీక్షతో ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చో తెలుసుకోవచ్చని చెపుతున్నారు. ఇందుకోసం వారు బయోమార్కర్ వ్య

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (09:01 IST)
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త అంశాన్ని కనుగొన్నారు. ఒక రక్త పరీక్షతో ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చో తెలుసుకోవచ్చని చెపుతున్నారు. ఇందుకోసం వారు బయోమార్కర్ వ్యవస్థ అనేదాన్ని అభివృద్ధి చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
ఒక వ్యక్తి జీవిత కాలాన్ని అంచనావేసేందుకు ఓ బయోమార్కర్‌ వ్యవస్థను అభివృద్ధిచేశారు. దీనికోసం 5,000 మంది రక్త నమూనాలపై పరిశోధన చేపట్టారు. వాటిని దానంచేసిన వ్యక్తుల ఆరోగ్య వివరాలను ఎనిమిదేళ్లపాటు పరిశీలించారు. ముఖ్యంగా ఏళ్లు పైబడటంతో వచ్చే క్యాన్సర్‌, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధుల లక్షణాలు, వాటి బయోమార్కర్లను గుర్తించారు. 
 
వీటితో 26 భిన్న బయోమార్కర్లు కలిగిన తాజా అంచనాల వ్యవస్థను సిద్ధంచేశారు. మన రక్త నమూనాలోని బయోమార్కర్లను వీటితో సరిపోల్చడంతో ఎన్నేళ్లు బతకగలమో చెప్పొచ్చని పరిశోధకులు థామస్‌ పెర్ల్స్‌ వివరించారు. ఈ పద్ధతిలో తొలినాళ్లలోనే వివిధ వ్యాధుల ముప్పులనూ గుర్తించే వీలుందని పేర్కొన్నారు. అయితే ఫలితాల్లో ఖచ్చితత్వం పెంచేందుకు లోతైన పరిశోధన అవసరమని అభిప్రాయపడ్డారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments