Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో చిక్కుడు కాయలు తింటే...

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (20:12 IST)
శీతాకాలం వచ్చిందంటే చిక్కుడు కాయ కంటికి ఇంపుగా నోరూరిస్తూ కనిపిస్తుంటుంది. కణుపు చిక్కుడుకాయ రుచిలోనే కాదు మన శరీరానికి పోషకాలను అందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ముఖ్యంగా వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు హృద్రోగాలు, క్యాన్సర్లు.... వంటి వాటిని దూరం చేస్తాయి. చిక్కుడు కాయలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి.
 
2. చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషదంలా పని చేస్తాయి.
 
3. చిక్కుడు కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 
4. వీటిలోని కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్.... వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలోని కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతుంది. ఫలితంగా చిక్కుడు కాయలు వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయని తేలింది.
 
5. సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. అందుకే దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి చిక్కుడు మంచి ఔషదంలా పని చేస్తుంది.
 
6. నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక  ఆందోళనను తగ్గిస్తాయి. అలాగే వీటిల్లోని పొటాషియం కండరాల వృద్దికి, పని తీరుకి తోడ్పడుతుంది. అంటే మనకు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నమాట.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments