Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (22:08 IST)
స్మార్ట్ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా? ఐతే మీ పని అయిపోయినట్టే. స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రతి నిమిషం కూడా గడవని పరిస్థితి. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది. చివరకి టాయ్‌లెట్‌లో కూడా స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా బాత్రూమ్‌ల్లో స్మార్ట్ ఫోన్లు వాడి వారికి పైల్స్ వ్యాధి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి చూస్తే… టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు ఫోన్‌ని తీసుకెళ్లడం వల్ల పైల్స్‌కి దారి తీస్తుంది.
 
యువతలో కూడా ఇది ఇప్పుడు వస్తోంది. మొబైల్ వల్ల పైల్స్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే… ఫోన్‌ని వాడడం వల్ల సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. దీని మూలంగా అది మారుతుంది. టాయ్‌లెట్‌‌లో స్మార్ట్ ఫోన్లను వాడటం ద్వారా కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. టాయిలెట్‌లో కూర్చుని పేపర్ చదివిన, మొబైల్‌‌ని ఉపయోగించిన సమస్య ఏమీ తెలీదు.
 
ఇలా ఎక్కువ సేపు టాయ్‌లెట్‌లో కూర్చుని ఉంటే పాయువు మరియు పురీషనాళం కండరాల నరాల పై ఒత్తిడి పడుతుంది. ఇది పైల్స్ సమస్యకు ఓ కారణం అవుతుంది. అలానే టాయిలెట్‌కు ఫోన్‌ తీసుకెళ్లడం ద్వారా దానికి బ్యాక్టీరియా అంటుకుంటుంది.
 
చేతులు శుభ్రం చేసుకున్న మొబైల్‌ని కడగడం కుదరదు కనుక మొబైల్‌కి అంటుకున్న బ్యాక్టీరియా మిమ్మల్ని ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. కాబట్టి మొబైల్‌ని బాత్రూమ్‌లో ఉపయోగించకుండా ఉంటేనే మేలు. లేదంటే ఎన్నో సమస్యలు బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తర్వాతి కథనం
Show comments