Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిరాత్రి వధువు చేతికి పాల గ్లాసు ఎందుకిస్తారు?

నవదంపతుల తొలి రాత్రిన వధువు చేతికి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపుతారు. ఇలా ఎందుకు చేస్తారో? చాలా మందికి స్పష్టంగా తెలియదు. వధువు చేతికి పాలగ్లాసు ఎందుకు ఇస్తారో ఇపుడు తెలుసుకుందాం. మొదటిరాత్రి పాల గ్లా

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (16:12 IST)
నవదంపతుల తొలి రాత్రిన వధువు చేతికి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపుతారు. ఇలా ఎందుకు చేస్తారో? చాలా మందికి స్పష్టంగా తెలియదు. వధువు చేతికి పాలగ్లాసు ఎందుకు ఇస్తారో ఇపుడు తెలుసుకుందాం. మొదటిరాత్రి పాల గ్లాసుతో వచ్చిన వధువు మనసు పాలవలే మృదువుగా ఉంటుందట. కొత్త అనుభవం, కొత్త పరిసరాలంటే కొంత జంకుగానూ ఉంటుంది. 
 
పైగా, శోభనం రోజున కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కినెడుతూ ఉంటుంది. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు వెళ్ళనీయవు. అందుకే శోభనం రాత్రిగానీ, ఆ తర్వాతగానీ కొత్త పెళ్ళి కొడుకు సున్నితంగా వ్యవహరించాలని పెద్దలు సలహా ఇస్తుంటారు. లేకుంటే తొలి మూడు రోజుల్లోనే నవదంపతుల మధ్య స్పర్థలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదటి నుంచీ ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. చక్కటి సందర్భోచిత మాట తీరుతో ఆకట్టుకోవాలి. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదు కాబట్టీ ముద్దు ముచ్చట్లతో గది నిండా సుగంధ ద్రవ్యాలతో నింపి ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
 
కానీ పూర్వకాలంలో పెళ్ళికి ముందు అబ్బాయికి నువ్వు సున్ని ఉండలు తనిపించేవారు. ఇవి ధాతుపుష్టి కలిగించే బలం ఉన్నది. అందుకే తొలిరాత్రి శొభనం రోజున వధువు చేతికి పాలగ్లాసు ఇచ్చి లోనికి పంపుతారట. పాలు వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. అలాగే సున్ని ఉండలు వీర్యాన్ని, నడుముకు బలాన్ని అందిస్తాయి. శోభనం రొజున పెట్టే తీపి తినుబండారాలు సప్త ధాతువులకు శక్తినిస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments