Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా? ఐతే రోజూ గోధుమ రవ్వ ఉప్మా తీసుకోండి...

బరువు తగ్గాలా? అయితే గోధుమ రవ్వను ఉపయోగించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోధుమ రవ్వ వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించడంలో దోహదపడుతుంది. ఇందులో ఫైబర్‌, విటమిన్ 'B' అధికంగా ఉంటుంది. బ

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:42 IST)
బరువు తగ్గాలా? అయితే గోధుమ రవ్వను ఉపయోగించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోధుమ రవ్వ వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించడంలో దోహదపడుతుంది. ఇందులో ఫైబర్‌, విటమిన్ 'B' అధికంగా ఉంటుంది. బరువు తగ్గటం కోసం గోధుమ రవ్వను తినే వారిని చూసే ఉంటారు.
 
రోజు గోధుమ రవ్వను తినని ఆడవారితో పోలిస్తే, రోజు తినే ఆడవారి శరీర బరువు తక్కువగా ఉందని పరిశోధనలు తేల్చాయి. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించుటకు గానూ, వీటిలో అధిక మొత్తంలో పోషకాలతో పాటుగా, తక్కువ క్యాలోరీలను కలిగి ఉంటాయి. గోధుమ రవ్వ అధిక మొత్తంలో ఫైబర్ స్థాయిలను కలిగి ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ లు జీర్ణవ్యవస్థను సజావుగా జరపటమే కాకుండా, శరీర భాగాల అన్ని విదులను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించేలా ప్రోత్సహించి పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
గోధుమ రవ్వ అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉంటుంది కావున, జీర్ణాశయంలో గ్రహించబడటానికి కూడా ఎక్కువ సమయంపడుతుంది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినటం వలన త్వరగా ఆకలిగా అనిపించే భావనకు గురి అవుతారు. కానీ, కొద్ది మొత్తంలో తినే గోధుమ రవ్వ చాలా సమయం పాటు ఆకలి కాకుండా చూస్తుంది. అందుచేత రోజూ ఒక కప్పు గోధుమ రవ్వ ఉప్మాను డైట్‌లో చేర్చుకుంటే బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

తర్వాతి కథనం
Show comments