Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజువారిలో మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు...

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2016 (11:17 IST)
సాధారణంగా పని ఒత్తిడిలో సమయానికి భోజనం చేయడం చాలామంది మరచిపోతుంటారు. పని ఒత్తిడి కారణంగా.. లేదా ఇతరత్రా పనులతో బిజీగా ఉండటం వల్ల భోజనం చేసే సమయం దొరకదు. ఇలాంటి సమయంలో ఆ సమయానికి అందుబాటులో ఉండే ఏదో ఒకటి తీసుకుని ఆకలిని చంపుకుంటారు. ఇలా చేయడాన్ని వైద్యులు తప్పుబడుతున్నారు. 
 
మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే... ఒక వయస్సు దాటిన తర్వాత ఓవర్ వెయిట్‌ వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కొందరు వర్కౌట్స్ ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల లావు లేదా బరువు తగ్గడం అటుంచి.. నీరసం వచ్చి పడిపోవడం ఖాయమని వైద్యులు అంటున్నారు. 
 
ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రతి మనిషి నిర్ణీత వేళకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయాన్ని బలవర్థకమైన అల్పాహారాన్ని మితంగా కాకుండా కాస్త ఎక్కువగానే తీసుకోమంటున్నారు న్యూట్రీషియన్లు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మీ ఎనర్జీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుందట. 
 
అలాగే, ప్రతి రోజూ మీరు తీసుకునే ఆహారాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని, అందులో సగం తాజా కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఇక మిగిలిన సగంలో ఒక పావు పప్పు దినుసులు, మరో పావు వంతు మాంసకృత్తులు ఉండేలా చూసుకోండి. 
 
కొన్నిసార్లు దాహంగా ఉన్నా కూడా ఆకలిగా ఉన్నామనుకుని తెగ తినేస్తాం. అందుకే మీరెప్పుడు ఆకలిగా అనిపించినా ముందు ఓ గ్లాస్ వాటర్ తాగండి. దీని తర్వాత భోజనం చేస్తే తక్కువగా తినే అవకాశం ఉంది. 
 
మరికొన్ని సమయాల్లో ఒక పూట ఆహారం తీసుకోక పోయినా.. బాగా ఆకలేస్తుంది. అలాంటపుడు ఆకలేస్తుంది కదా అని గబగబా తినేస్తాం. దీని వల్ల ఎంత తింటున్నామనేది తెలియదు. నెమ్మదిగా, బాగా నమిలి తినాలి.
 
అలాగే, రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల మంచినీరు తాగాని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ టైమ్‌లో స్నాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. తక్కువ కేలరీస్ ఉన్న బాదాం లాంటివి తీసుకుంటే మరీ మంచిది. 
 
ముఖ్యంగా ఇంట్లో కాకుండా బయట ఆహారం తీసుకుంటే.. ముందు ఫ్రూట్ సలాడ్ కానీ, ఏదైనా సూప్‌గానీ తీసుకోవాలి. ఆ తర్వాతే భోజనం చేయాలి. దీనివల్ల హై కేలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. భోజనం తర్వాత ఐస్‌క్రీమ్, కేక్ లేదా పాయసం వంటివి దూరంగా ఉంచితే మంచిది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Show comments