Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు ఎలా తాగాలి.. నిలబడి నీళ్లు తాగకూడదా? కచ్చితంగా కూర్చునే తాగాలా? ఎందుకు?

నిలబడి ఉన్నప్పుడు నీటిని సేవిస్తే నీరు ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశ‌యం గోడ‌లు

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (17:06 IST)
దాహమేస్తే నీళ్లను తాగేయడం వరకే మనకు తెలుసు. అది కూర్చుని తాగుతున్నామా? నిల్చుని తాగుతున్నామా? అనేది తర్వాతి విషయం. కానీ నీళ్లు తాగేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లైనా తాగాలి. నీటిని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. అయితే నీటిని ఎంత తాగినా, ఎప్పుడు తాగినా నిల‌బ‌డి మాత్రం తాగ‌కూడ‌ద‌ట‌. 
 
క‌చ్చితంగా కూర్చునే నీటిని తాగాల‌ట‌. ఎందుకంటే..? నిలబడి ఉన్నప్పుడు నీటిని సేవిస్తే నీరు ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశ‌యం గోడ‌లు దెబ్బ తింటాయి. జీర్ణాశయ గోడలు దెబ్బతింటే.. అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక నిలబడి ఉన్నప్పుడు కానీ నీరు తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని.. తద్వారా కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కానీ కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ స్థితిలో నీరు తాగితే.. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు జీర్ణాశ‌యంలోకి అధికంగా ఉత్ప‌త్తి అయ్యే ఆమ్లాల ప్ర‌భావం త‌గ్గుతుంది. అదే నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోయి ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments