Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు ఎలా తాగాలి...? మీ బరువును 10తో భాగించి అందులో నుంచి 2 తీసేసి...

ఈ మధ్యకాలంలో జపాన్ వారు 200 కోట్ల డాలర్ల ఖర్చుతో ఒక పరిశోధన నిర్వహించారు. ఆ పరిశోధన నిరూపించిన విషయమేమిటంటే ఉదయాన్నే నిద్ర లేవడంతోనే ఒక లీటరు నీరు త్రాగడం వలన శరీరంలోని మలినాలన్నీ పోతాయని తేలింది. నేటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాగ్భటుడనే ఆయుర్వ

Webdunia
సోమవారం, 25 జులై 2016 (12:18 IST)
ఈ మధ్యకాలంలో జపాన్ వారు 200 కోట్ల డాలర్ల ఖర్చుతో ఒక పరిశోధన నిర్వహించారు. ఆ పరిశోధన నిరూపించిన విషయమేమిటంటే ఉదయాన్నే నిద్ర లేవడంతోనే ఒక లీటరు నీరు త్రాగడం వలన శరీరంలోని మలినాలన్నీ పోతాయని తేలింది. నేటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాగ్భటుడనే ఆయుర్వేద శాస్త్రవేత్త ఈ విషయాన్ని మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా చెప్పాడు. దాన్ని ఉషఃపానం అనే పేరుతో పిలుస్తారు. 
 
రాత్రిపూట ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవడం తోనే ఆ లీటరు నీళ్ళు త్రాగాలి. ఈ విషయం అందరూ చెబుతారు కానీ ఇక్కడ ఒక్క నియమం పాటించాలి. నీళ్ళు ఎప్పుడూ కూర్చునే త్రాగాలి, పాలు, టీ, కాఫీ ఎప్పుడూ నిలబడే త్రాగాలి. అంతేకాదు నీళ్ళు గడగడా త్రాగకూడదు. క్రింద కూర్చుని కొంచెం కొంచెంగా టీ త్రాగినట్టు, కాఫీ త్రాగినట్టు త్రాగాలి. అంతేకానీ నీళ్ళు ఒక్కసారిగా గ్లాసు ఎత్తి పట్టుకుని గడగడా త్రాగకూడదు. ఇదీ నీళ్ళు త్రాగే విషయంలో పాటించాల్సిన ఖచ్చితమైన విషయం.
 
మన బరువును 10తో భాగించి దానిలో నుండి రెండు తీసివేస్తే ఎంత అంకె వస్తుందో అన్ని లీటర్లు త్రాగాలి. ఉదాహరణకు మీరు 60 కిలోలు ఉన్నారనుకుంటే, 60ని 10తో భాగిస్తే 6, దీనిలో 2 తీసివేస్తే 4. అంటే నాలుగు లీటర్ల నీరు రోజూ త్రాగాలి. ఆహారం తీసుకునే ఒక గంట ముందు లేదా ఒక గంట తరువాత మాత్రమే నీరు త్రాగాలి. "భోజనాంతే విషం వారి" అనేది సూత్రం. అంటే భోజనం తరువాత నీరు త్రాగడం విషంతో సమానం అని. కొద్దిగా గొంతు తడుపుకోవడానికి, తిన్న తరువాత రెండు లేదా మూడు గుటకల నీరు త్రాగవచ్చు. నీటి విషయంలో ఈ నియమాన్ని పాటిస్తే మలబద్దకం, గ్యాస్ మొదలైన ఉదర సంబంధ రోగాలకు దూరంగా ఉండవచ్చు. మంచినీళ్ళకు మట్టి కుండలు, త్రాగడానికి రాగి చెంబులు వాడటం వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments