పల్చనవుతున్న వీర్యపుష్టి.. పెరుగుతున్న సంతానలేమి...

యువతీయువకులు చిన్న వయసులోనే తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటురున్నారు. మారిన జీవనశైలి యువతలో లైంగిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఐదంకెల జీతాలతో యువత ఆర్థికంగా పటిష్టంగా ఉంటున్నా సంసారం మాత్రం

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (12:22 IST)
యువతీయువకులు చిన్న వయసులోనే తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటురున్నారు. మారిన జీవనశైలి యువతలో లైంగిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఐదంకెల జీతాలతో యువత ఆర్థికంగా పటిష్టంగా ఉంటున్నా సంసారం మాత్రం బీటలు వారుతోంది. ఒకవైపు ఆఫీసులో పని.. ఇంటికి వచ్చాక ఇంటి పని రెండింటినీ సమతుల్యం చేయలేక తీవ్ర అలసటకు గురవుతున్నారు. ఫలితంగా స్త్రీపురుషులు, భార్యాభర్తల్లో లైంగికాసక్తి తగ్గుతోంది. దీనికితోడు యువతలో లైంగికశక్తి ‘నిర్వీర్య’మైపోతోంది.
 
గతంతో పోలిస్తే.. యువకుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పునరుత్పాదక శక్తి సన్నగిల్లుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. అమెరిన్‌ సొసైటీ ఆఫ్‌ ఆండ్రాలజీ ఉత్తర అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా ఖండాల్లో యువకుల్లో వీర్యకణాల స్థితిగతులపై పరిశోధనలు జరిపింది. 4 దశాబ్దాల క్రితంతో పోలిస్తే వీర్యకణాల వృద్ధి 52 శాతం తగ్గిందని వెల్లడైంది.
 
ఇది ఆందోళన కలిగించే విషయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో కూడా ఈ సమస్య ఉంది. ఇక వీర్యకణాల సాంద్రత తగ్గడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 1973లో ఒక మిల్లీలీటరు వీర్యంలో సగటున 99 మిలియన్ల వీర్యకణాలు ఉండేవి. 2011నాటికి అవి 47 మిలియన్లకు పడిపోయాయి. మిల్లీలీటరు వీర్యంలో 40 మిలియన్ల కణాల కంటే తక్కువ ఉంటే సంతానం కలిగే అవకాశాలు తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 15 మిలియన్ల కంటే తక్కువుంటే సంతాన భాగ్యం ఉండదని ఆ సంస్థ తెలిపింది.
 
ప్రస్తుతం 2015లో మన దేశంలో 22 కోట్ల మంది సంతానలేమితో బాధపడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. 2020 నాటికి అది 25 కోట్లకు పెరుగుతుందని అంచనా. మన దేశంలో 2.2 నుంచి 3.3 కోట్ల మంది దంపతులు శాశ్వత సంతాన లేమితో బాధపడుతున్నారు. ప్రపంచంలో మరేదేశంలో లేని విధంగా శాశ్వత సంతానలేమితో బాధపడే దంపతుల సంఖ్య భారతదేశంలో నానాటికీ పెరిగిపోడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతానలేమికి 40 నుంచి 50 శాతం మహిళల్లో ఉన్న లోపాలు కారణం కాగా, 30 నుంచి 40 శాతం మగవారిలో ఉన్న లోపాలు ప్రధాన కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చితే ఇటీవల కాలంలో యువకుల్లో ఈ లోపాలు పెరిగిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం