Webdunia - Bharat's app for daily news and videos

Install App

థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (19:10 IST)
ఇటీవల కాలంలో బి.పి, షుగర్ వ్యాధుల లాగానే థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది...? 
 
సరియైన ఆహారం తీసుకోకపోవడం, హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. అందుకని మందులతో కంట్రోల్ అవుతుంది అనుకోవడం తప్పు. మందులతో పాటు సరియైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను నియంత్రించవచ్చు. మన ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగితే మందుల ప్రభావం త్వరగా కలిగి థైరాయిడ్ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అదెలాగో చూద్దాం.
 
థైరాయిడ్ గ్లాండ్ అనేది మెడ భాగంలో ఉంటుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ శరీరంలోని జీవక్రియ రేటును కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయి. 1. హైపో 2. హైపర్ థైరాయిడ్. 
 
హైపో థైరాయిడ్ - ఇది శరీరానికి తగినంత థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేయదు. అందువల్ల శరీరంలో జీవక్రియ రేటు తగ్గిపోతుంది. మీరు ఏది తిన్నా కూడా త్వరగా ఎనర్జీలా మారదు. కాబట్టి బరువు త్వరగా పెరిగిపోతారు. ఎప్పుడూ అలసట నీరసంగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.
 
1. అవిసె గింజలు.. వీటిలో ఒమేగా-3 ప్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పని తీరును మెరుగుపరుస్తాయి. థైరాక్సిన్ కావల్సినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. నిత్యం అవిసె గింజలను, లేదా పొడిని ఏదా ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
 
హైఫర్ థైరాయిడ్.. ఈ సమస్య ఉన్నవారు బరువు తగ్గిపోతుంటారు. నీరసంగా ఉండటం, నిద్ర పట్టకపోవడం లాంటి వాటితో బాధపడుతుంటారు. 
 
2. ఉప్పు... మనం రోజూ తీసుకునే ఉప్పులో అయోడిన్ ఉంటుంది. అయితే ఉప్పును అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటే థైరాక్సిన్‌ను ఎక్కువ ఉత్పత్తి చేసి హైపర్ థైరాయిడ్ కలిగేలా చేస్తుంది. ఈ సమస్య ఉన్నవారు రోజుకి 5 గ్రాముల ఉప్పుని మాత్రమే తీసుకోవాలి.
 
వాల్నట్స్... వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అది థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో థైరాక్సిన్ అవసరమున్నంత మేర శరీరానికి అంది థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
అల్లం... థైరాయిడ్ సమస్య ఉన్నవారు అల్లాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం తేనెతో సేవించాలి. దీంతో థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.
 
హైఫో థైరాయిడ్ ఉన్నవారు పచ్చి కూరగాయలను తక్కువగా తింటే మేలు. దీంట్లో ఉండే జియోట్రెజిన్ మంచిది కాదు. క్యాబేజి, కాలీప్లవర్, బ్రకోలి, ముల్లంగి లాంటివి తక్కువగా తింటే మంచిది. వీరు పాలతో చేసిన పదార్దాలు తక్కువగా తీసుకుంటే మంచిది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు మందులు, ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం కూడా చేస్తుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments