Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం వేడి వేడిగా తింటున్నారా?

అన్నం వేడి వేడిగా తింటున్నారా? కాస్త ఆగండి.. వేడి వేడి అన్నం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న శక్తి హరించుకునిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే అన్నం వండిన కాస్తంత వేడి చల్లారగానే తీసుకుంటే సరి

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (13:32 IST)
అన్నం వేడి వేడిగా తింటున్నారా? కాస్త ఆగండి.. వేడి వేడి అన్నం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న శక్తి హరించుకునిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే అన్నం వండిన కాస్తంత వేడి చల్లారగానే తీసుకుంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. అన్నాన్ని వేడిగానూ.. బాగా చల్లారిన తర్వాతనో తీసుకోకూడదు. మితమైన వేడిలో ఉన్నప్పుడే అన్నం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. 
 
అలాగే వేయించిన బియ్యం ఒక కప్పు, వేయించిన పెసరపపు అర కప్పు, ఒక కప్పు పాలు కలిపి నాలుగు గ్లాసుల నీటితో ఉడికించి.. ఆ తర్వాత ఒక పాత్రలో నూనెవేసి ఇంగువ, ఉప్పు, ధనియాలు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు కొద్దికొద్దిగా వేసి తాళింపు పెట్టి ఆ ఆహారం తీసుకుంటే వాత పిత్త కఫ దోషాలు హరించుకుపోతాయి. ఆకలి పెరుగుతుంది. రక్తవృద్ధి కలగడంతో పాటు, ప్రాణశక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
అలాగే బియ్యానికి నాలుగు రెట్ల నీళ్లు కలిపి ఉడికించిన అన్నం తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. వేసవిలోనే కాకుండా ఆహారం పూర్తయ్యాక మజ్జిగ అన్నం తీసుకుంటే మూల వ్యాధి తగ్గిపోతుంది. రక్తవృద్ధి కలుగుతుంది. నీరసం, అలసట వుండదు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments