Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదా ఎక్కువ తింటే... ఆరోగ్యం గోవిందా!

మ‌న వంట‌కాల్లో ముఖ్యంగా చిరుతిండిలో మైదా ఎక్కువ‌గా వాడ‌తారు. కారం, తీపి చిప్స్, పుల్కా, చ‌పాతీ, ఇలా చాలా స్నాక్స్‌లో మైదా వాడేస్తుంటారు. కానీ, ఈ మైదా అతిగా తింటే ఆరోగ్యం సంగ‌తి అంతే అంటున్నారు ఆరోగ్య‌వేత్త‌లు. అస‌లు మైదా ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? మామ

Webdunia
బుధవారం, 6 జులై 2016 (13:59 IST)
మ‌న వంట‌కాల్లో ముఖ్యంగా చిరుతిండిలో మైదా ఎక్కువ‌గా వాడ‌తారు. కారం, తీపి చిప్స్, పుల్కా, చ‌పాతీ, ఇలా చాలా స్నాక్స్‌లో మైదా వాడేస్తుంటారు. కానీ, ఈ మైదా అతిగా తింటే ఆరోగ్యం సంగ‌తి అంతే అంటున్నారు ఆరోగ్య‌వేత్త‌లు. అస‌లు మైదా ఎక్క‌డి నుంచి వ‌స్తుంది?  మామూలుగా ఆలోచిస్తే, గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, రాగుల నుండి రాగిపిండి వస్తుంది. కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మైదా పిండి ఎలా వస్తుంది... అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక్కసారి చ‌ద‌వండి.
 
మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి అజోడికార్బోన‌మైడ్, క్లోరిన్ గ్యాస్, బెన్జోయ‌ల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. అదే మ‌నం వాడే మైదాపిండి. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడ‌కాన్ని చైనా, ఐరోపా దేశాల్లో నిషేధించారు. మైదాలో అల్లాక్స‌న్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
 
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలా కార్యాలయాల్లో కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు. మైదా పిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు. దీనివ‌ల్ల మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి. మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు క‌లుగుతాయ‌ని డాక్ట‌ర్లు చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్యను కొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

తర్వాతి కథనం
Show comments