Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్‌ఫోన్లతో సెల్ఫీల పిచ్చి: మొబైల్‌పై క్రిములు.. ఫోన్లలోకి బ్యాక్టీరియా ఎలా?

సెల్‌ఫోన్ ప్రతి యొక్కరి చేతుల్లో ఉండే సాధనం. సాధనం కంటే ఆయుధం అని చెబితే అతిశయోక్తి లేదేమో. త‌క్కువ సమయంలోనే ప్రజల మనసును దోచేసింది. మ‌నిషికి ఆహారం, నీరు, నిద్ర లేకుంటే బతకగలుగుతాడేమో గాని సెల్‌ఫోన్ ల

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2016 (13:32 IST)
సెల్‌ఫోన్ ప్రతి యొక్కరి చేతుల్లో ఉండే సాధనం. సాధనం కంటే ఆయుధం అని చెబితే అతిశయోక్తి లేదేమో. త‌క్కువ సమయంలోనే ప్రజల మనసును దోచేసింది. మ‌నిషికి ఆహారం, నీరు, నిద్ర లేకుంటే బతకగలుగుతాడేమో గాని సెల్‌ఫోన్ లేకుండా జీవించలేడు. సెల్‌ఫోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని అంశాల్లో ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
అవేంటో ఇప్పుడు తెల్సుకుందాం .... చాలామందికి సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ‌డం ఫ్యాషన్‌గా మారింది. యేడాదిలో 16 లక్షల రోడ్డు ప్రమాదాలు సెల్‌ఫోన్ల కారణంగానే జరుగుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. సెల్‌ఫోన్ల వ‌ల్ల సెల్ఫీల పిచ్చి విప‌రీతంగా పెరుగుతోంది. చాలా వరకు యువత సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే.
 
మొబైల్‌పై అధిక శాతం క్రిములున్నట్టు మీకు తెలుసా... దీనికి కారణం మొబైల్‌ను ఉపయోగిస్తారే తప్ప దాన్నిశుభ్రం చేయకపోవడమే. వంట చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడ‌డం, ఇంటిని శుభ్రం చేసి చేతులు శుభ్రం చేసుకోకుండా ఫోన్ ముట్టుకోవడం వల్ల ఇకోలి అనే బ్యాక్టీరియా ఫోన్లలోకి సోకుతుంది. దీనివల్ల జ్వరం, వాంతులు, అతిసారం వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ఈ ప్రమాదం నుండి తేరుకోవాలంటే... సెల్‌ఫోన్‌ను ఉపయోగించే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
 
ఎక్కువ‌గా సెల్‌ఫోన్ వాడ‌డం వ‌ల్ల ఎలక్ట్రానిక్ తరంగాలు శరీరానికి హాని తలపెట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మెదడుపై ఇవి విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల క్యాన్స‌ర్ వచ్చేఅవకాశం అధికంగా ఉంది.మొబైల్ ఉపయోగించే వారిలో ప్రధాన సమస్య కంటిచూపు. సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల, టెలివిజన్‌ను అధికంగా వీక్షించేవారి కంటిచూపు మందగిస్తున్నట్టు నిపుణులు  కనుగొన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments