Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే.. నెలసరి సమస్యలు మటాష్

పుదీనాను రోజూవారీగా ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలోని రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఉదరంలోని సూక్ష్మక్రిములను పుదీనా నశింపజేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు.. ఎండిన పుదీనాను గుప్పెడ

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (18:06 IST)
పుదీనాను రోజూవారీగా ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలోని రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఉదరంలోని సూక్ష్మక్రిములను పుదీనా నశింపజేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు.. ఎండిన పుదీనాను గుప్పెడు తీసుకుని.. ఒకటిన్నర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించి.. ఆ నీటిని  సేవించాలి. ఇలా చేస్తే జ్వరం తగ్గిపోతుంది. 
 
అలాగే మాంసాహారం, కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే.. పుదీనాను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి. జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. నెలసరి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మహిళలు పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే మంచిది. పుదీనా చట్నీ తీసుకుంటే.. ఉదర సమస్యలు దరిచేరవు. గర్భవతులు వేవిళ్లు తగ్గించుకోవాలంటే.. పుదీనాను డైట్‌లో చేర్చుకోవాలి. 
 
పచ్చ కామెర్లు, వాతం, దగ్గు, రక్తహీనత, నరాల బలహీనతకు పుదీనా దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మం పొడిబారినట్లు కనిపిస్తే.. పుదీనా రసాన్ని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పుదీనాను నీడలో ఎండబెట్టి పాలలో చేర్చి మరిగించి.. టీకి బదులుగా సేవిస్తే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని వారు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments