Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలంటే.. బ్రేక్‌ఫాస్ట్‌లో పుచ్చకాయను తీసుకోవాలట..

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (16:15 IST)
నెగటివ్ కేలరీస్ ఆహారాన్ని అల్పాహారంలో తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. లో-కెలోరీల ఆహారం అంటే పుచ్చకాయ, నిమ్మ వంటివే. ఈ లో-కెలోరీ ఫుడ్ బరువును తగ్గించడంలో భాగంగా కొవ్వును కరిగిస్తుందట.


పండ్లు, పచ్చని కూరగాయలు, ఆకుకూరలు కూడా లో- కెలోరీల ఆహారంగా పరిగణింబడతాయి. ముఖ్యంగా ఆపిల్‌ బరువు తగ్గిస్తుంది. ఇది రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. అలాగే అల్పాహారంలో బెర్రీస్‌ను తీసుకుంటే ఒబిసిటికి చెక్ పెట్టవచ్చు. 
 
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ తీసుకుంటే వాటిలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్.. గుండెను ఆరోగ్యంగా వుంచుతాయి. ఇక పుచ్చకాయలను అల్పాహారంలో తీసుకుంటే తప్పకుండా బాన పొట్ట తగ్గిపోతుంది. ఇందులో 95 శాతం నీరు వుండటంతో.. బరువును తగ్గించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచే పుచ్చకాయలు.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 
 
ఇకపోతే.. గ్లాసుడు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం చెరో స్పూన్ కలుపుకుని తాగితే.. పొట్ట ఇట్టే తగ్గిపోతుంది. ఇంకా రోజుకో గ్లాసుడు లెమన్ జ్యూస్ పరగడుపున తాగితే పొట్ట తగ్గిపోతుంది. అలాగే ద్రాక్ష పండ్లు కూడా బరువును తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. చర్మానికి మెరుగునిస్తాయని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments